మ్యూజిక్ పెడితే ఈ రాశి వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు... డాన్స్ వేసి దుమ్ము రేగ్గొడతారంతే...

Published : Apr 28, 2022, 11:16 AM ISTUpdated : Apr 28, 2022, 11:48 AM IST

ఇప్పుడు ఏ అకేషన్ వచ్చినా ముందుగా డ్యాన్స్ ఉండాల్సిందే. అయితే కొంతమంది ఉత్సాహంగా రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తే.. మరికొందరు దూరంనుంచి చూసి సంతోషిస్తారు. అయితే డ్యాన్స్ చేయడం కూడా మీ రాశిని బట్టే ఉంటుందట.. 

PREV
112
మ్యూజిక్ పెడితే ఈ రాశి వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు... డాన్స్ వేసి దుమ్ము రేగ్గొడతారంతే...
Representative Image: Aries

మేషరాశి (Aries) : డ్యాన్స్ అంటే వీరికి సరదా.. ఏ మూమెంట్ అయినా మెలికలు తిరిగిపోతూ చేస్తున్నారంటే వాళ్లే మేషరాశివారన్నట్టు. 

212
Representative Image: Taurus

వృషభరాశి ( Taurus) : అక్కడ వాయిస్తున్న సంగీతానికి అనుగుణంగా మెల్లగా, స్మూత్ గా ఒంటిని కదిలిస్తూ నృత్యం చేస్తారు.

312

మిధునరాశి ( Gemini) : డ్యాన్స్ హాల్ నుంచి ఎప్పుడు పారిపోదామా అన్నట్టుగా తలుపు దగ్గరే కాచుకుని కూర్చేనేవారే మిధునరాశి వారు. 

412

కర్కాటకరాశి ( Cancer) : ఇన్ స్ట్రక్టర్ చెప్పే దానికి, ఆ ట్యూన్స్ కు సన్నగా బాడీని కదిలించడమో, లేదంటే రేప్ రికార్డర్ ను ఫిక్స్ చేస్తూనో, మిగతా వారికి మంచినీళ్లు అందిస్తూనో కనిపిస్తారు. 

512
Leo

సింహరాశి (Leo) : డ్యాన్స్ ఎలా చేయాలో వారికి తెలుసు. కానీ అలా చేయరు. అయితే.. తాము బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నాం అనుకుంటారు.. అదన్నమాట సంగతి..

612

కన్యారాశి ( Virgo) : మిగతావాళ్లు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ తాము మాత్రం అంగుళం కూడా కదలరు. 

712

తులారాశి ( Libra) : డ్యాన్స్ క్లాసులో ఎవరైనా శ్రద్ధ గల విద్యార్థి ఉన్నారంటే వారు తులారాశివారే. నేర్చుకోవడానికి ముందువరుసలో నిలబడతారు.

812

వృశ్చికరాశి ( Scorpio) : డ్యాన్స్ చేయడం వల్ల వచ్చే చెమట చంపేస్తుందని, చికాకు పెడుతుందని గోల చేసేవారు వృశ్చికరాశివారే అయ్యుంటారు. 

912

ధనుస్సురాశి  (Sagittarius) : వీళ్లు డ్యాన్స్ చేస్తే తీన్మారే. టీ షర్ట్ విప్పి పక్కన పడేసి పిచ్చిపట్టినట్టుగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. 

1012
Representative Image: Capricorn

మకరరాశి ( Capricorn) : డ్యాన్స్ హాల్ నుంచి ఎప్పుడు పారిపోదామా అన్నట్టుగా తలుపు దగ్గరే కాచుకుని కూర్చేనే మిధునరాశి వారి పక్కనే.. నెక్ట్స్ నేనే అన్నట్టుండేవాళ్లే మకరరాశి వారు. 

1112
Representative Image: Aquarius

కుంభరాశి (Aquarius) : మిగతావాళ్లు చేసే డ్యాన్స్ చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటారు. అందర్నీ జడ్జ్ చేస్తారు. తమ వంతు వచ్చేసరికి అలిసిపోయినట్టుగా నటిస్తారు. 

1212

మీనరాశి ( Pisces) : వీళ్లు కూడా మేషరాశి వారిలా మెలికలు తిరగడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు వీరు మిగతావారితో కాకుండా తమ సొంత ట్యూన్ కు డ్యాన్స్ చేస్తుంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories