
1.మేష రాశి..
మేష రాశివారు కోపంగా ఉన్నప్పుడు, వారిని వెంటనే కదిలించకూడదు. వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. వారిని కాసేపు వదిలేస్తే, వారు కామ్ అయిపోతారు. ఆ తర్వాత వారితో ఇష్యూ గురించి మాట్లాడితే సరిపోతుంది.
2.వృషభ రాశి..
వృషభ రాశివారు కోపం ఉన్నప్పుడు, మీరు కూడా కోపంతో ఊగిపోకూడదు. వారితో ప్రశాంతంగా డీల్ చేయాలి. మీరు కూడా కోపం చూపించకూడదు. వారి కోపం తగ్గేంత వరకు ప్రశాంతంగా మీరు ఉంటే, అప్పుడు తర్వాత వారు కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది.
3.మిథున రాశి..
మిథున రాశివారు కోపంగా ఉన్నప్పుడు వారితో ఓపెన్ గా ఉండాలి. డొంకతిరుగుడులా మాట్లాడితే, వారికి కోపం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, డైరెక్ట్ గా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కోపంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడకూడదు. వారు ఏం చెప్పాలి, వారి ఫీలింగ్స్ ఏంటి అనే విషయాన్ని వారు ఏం చెబుతున్నారో మీరు ఓపికగా వినాలి. అప్పుడు వారు ఆ కోపం నుంచి బయటకు వస్తారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. అలాంటి సమయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు. ఓపికగా, మౌనంగా ఉండాలి. వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా ఓపికగా వినాలి.
6.కన్య రాశి..
కన్య రాశివారు కోపంగా ఉన్నప్పుడు వారి కోపం ఎలా తగ్గించాలో చూడాలి. వారి సమస్యకు పరిష్కారం వెతకాలి. అంతేకానీ, వారిని విమర్శించడం లాంటివి చేయకూడదు.
7.తుల రాశి..
తుల రాశివారు కోపంగా ఉన్నప్పుడు, వారికి ఆ కోపం తగ్గించడానికి ప్రయత్నించాలి. దాని కోసం వారిని ఆ కోపం నుంచి డైవర్ట్ చేయాలి. అప్పుడు వాళ్లు మళ్లీ నార్మల్ అయిపోతారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కోపంగా ఉన్నప్పుడు, మీరు వారితో నిజాయితీగా ఉండాలి. వారితో అడ్డంగా వాదించకూడదు. వారి ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వాలి. జడ్జిమెంట్ చేయకూడదు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు కోపంగా ఉన్నప్పుడు ఈ రాశివారిని కాసేపు కూల్ వదిలేయాలి. ఆ తర్వాత వారికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
10.మకర రాశి..
మకర రాశివారికి కోపం వచ్చినప్పుడు వారు ఎక్కువగా మర్యాద కోరుకుంటారు. ఈ రాశివారు ఏం చెబుతున్నారో విని, వారి సమస్యకు మీరు పరిష్కారం చెప్పాలి.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు మామూలుగానే చాలా తెలివైన వారు. కోపంలో వీరి తెలివి మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివిగా వాదిస్తారు. కాబట్టి, ఆ సమయంలో వారితో చాలా తెలివిగా డీల్ చేయడం తెలిసి ఉండాలి.
12.మీన రాశి..
మీన రాశివారికి కోపం వచ్చినప్పుడు మీరు వారి లిజనింగ్ ఇయర్ గా మారాలి. వారు చెప్పేది ఓపికగా వినేవారు కోరుకోవాలని వారు అనుకుంటూ ఉంటారు. అలా ఉంటే, వారి కోపం వెంటనే తగ్గిపోతుంది.