
అందరూ సరదాగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మన పరిస్థితులు మనల్ని అలా ఉండనివ్వకపోవచ్చు. అయితే.. మూడీగా ఉన్నవారిని మళ్లీ ఉత్సాహపరచడం ఎలాగో చాలా మందికి తెలియదు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం మూడీగా ఉన్నవారిని మళ్లీ ఉత్సాహంగా మార్చాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం...
1.మేష రాశి...
మేష రాశివారు మూడీగా ఉన్నప్పుడు వారిని మళ్లీ ఉత్సాహపరచాలి అంటే... వారితో కాసేపు కూర్చోవాలి. వారితో ప్రశాంతంగా కూర్చొని వారిలోని బాధ ను తొలగించే ప్రయత్నం చేయాలి. వారికి వారే తమ చుట్టూ ఏర్పరుచుకున్న కంచెను చెరిపేసి... వారు మళ్లీ ఉత్సాహంగా మారేలా చేయాలి. దీనికి మీ మంచి మాటలు సరిపోతాయి.
2.వృషభ రాశి..
ఈ రాశివారు బాధలో లేదంటే మూడీగా ఉంటే... వీరు ఫిజికల్ ఎఫెక్షన్ కోరుకుంటారు. వీరిని ప్రేమగా దగ్గర తీసుకొని.. చేతితో నిమరుతూ మాట్లాడితే... వీరు ఆ బాధ నుంచి బయటపడి మళ్లీ ఉత్సాహంగా మారతారు.
3.మిథున రాశి...
మిథున రాశివారు ఏదైనా బాధ ఉంటే తమలోనే దాచుకుంటారు. కాబట్టి... వారి మనసులోని బాధను బయటకు చెప్పుకోగలిగేలా చేస్తే... ఈ రాశివారు మళ్లీ ఉత్సాహంగా మారతారు.
4.కర్కాటక రాశి...
ఈ రాశివారు డల్ గా ఉన్నా.. మూడీగా ఉన్నా.. వారికన్నా తోపులు ఎవరూ లేరని... వారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటూ ప్రోత్సహిస్తే.. మళ్లీ ఉత్సాహంగా మారతారు. వీరికల్లా వారి ఈగో చల్లారాలి. అప్పుడు ఆనందంగా ఉంటారు.
5.సింహరాశి..
ఈ రాశివారు మామూలుగానే అటెన్షన్ సీకర్స్. ఎప్పుడూ అందరూ తమపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటారు. ఇక వీరు డల్ గా ఉన్నప్పుడు కూడా కాస్త వారిపై అటెన్షన్ చూపిస్తే.. ఈ రాశివారు మళ్లీ మామూలుగా అయిపోతారు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు ఉత్సాహంగా ఉండాలి అంటే.. వారి బాధను చెప్పుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఈ రాశివారు తమ బాధను చెబుతుంటే.. ప్రశాంతంగా ఎవరైనా వింటే వీరు తమ బాధను తగ్గించుకుంటారు.
7.తుల రాశి...
తుల రాశివారు మూడీగా ఉన్నప్పుడు వారితో సమయం గడపాలి. వారితోనే ఎక్కువ సేపు గడిపితే.. అప్పుడు వారు తమ బాధ నుంచి బయటపడతారు. మళ్లీ ఉత్సాహంగా మారతారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు బాధలో ఉన్నప్పుడు వీరికి ఎవరి అవసరం లేదు. ఆ బాధ నుంచి వారంతట వారే బయటపడతారు. ఇతరులు తలదూర్చనవసరం లేదు. వారు ఒంటరిగా ఉండాలి అనుకుంటే ఉండనివ్వాలి.
9. ధనస్సు రాశి..
ఈ రాశివారు బాధలో మూడీగా ఉన్నప్పుడు వారికి మీ తోడు చాలా అవసరం. వీరి పక్కన ఉంటే.. వారితో సరదాగా మాట్లాడితే వారు తొందరగా ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
10.మకరరాశి..
మకర రాశివారు బాధలో ఉన్నప్పుడు వారు మళ్లీ ఉత్సాహంగా మారాలి అంటే వారి దగ్గర ఒక చిల్డ్ పర్సన్ ఉండాలి. వాళ్లు సరదాగా వీరితో కాసేపు గడిపితే చాలు వీరు కూడా బాధ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
11.కుంభ రాశి...
కుంభ రాశివారు బాధ నుంచి బయటపడాలి అంటే.. వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. వారిని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేయాలి. అయితే... అలా అని వారిని మరీ పూర్తిగా ఒంటరిగా మాత్రం వదిలేయకూడదు.
12. మీన రాశి..
ఈ రాశివారు మూడీగా బాధలో ఉన్నప్పుడు.. వారు మనసులో మాట చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటే బాగుండని కోరుకుంటారు. అలా ఎవరైనా వారికి కాస్త తోడుగా ఉండి.. వారితో మనసులో మాట పంచుకోలగలిగితే.. వీరు తొందరగా ఆ బాధ నుంచి బయటపడతారు.