
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలా ఉన్నా... తమ పిల్లలకు మాత్రం తాము ఆదర్శంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లలు తమను ఓ హీరోలా గా చూడాలని ప్రతి పేరెంట్స్ ఆశపడుతుంటారు. అయితే... మీరు బెస్ట్ పేరెంట్స్ అవ్వాలంటే... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ మార్పులు చేసుకోవాలో ఓసారి చూద్దాం...
1.మేష రాశి..
నిజానికి మేష రాశివారికి ఓపిక చాలా తక్కువ. నిర్ణయాలు కూడా చాలా హఠాత్తుగా తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ రాశివారు బెస్ట్ పేరెంట్స్ అవ్వాలంటే... మీ పిల్లలు ఏం చెబుతున్నారో ముందు వినడానికి ప్రయత్నించాలి. వారు చెప్పేది వినడం అలవాటు చేసుకోవాలి.
2.వృషభ రాశి..
పిలలలకు చాలా కోరికలు ఉంటాయి. అయితే... ఈ రాశివారు.. తమ పిల్లలపై అమితమైన ప్రేమ చూపించి.. వారి అన్ని కోరికలు తీర్చాలని.. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. నిజంగా మీరు బెస్ట్ పేరెంట్ అవ్వాలి అనుకుంటే.. పిల్లల కోసం దుబారా ఖర్చు చేయడం ఆపాలి. ఎంత వరకు అవసరమో ఆలోచించి మాత్రమే ఖర్చుపెట్టాలి.
3.మిథున రాశి..
మిథున రాశి వారు.. తమ పిల్లలతో చాలా స్నేహంగా ఉంటారు. అయితే.. ఆ స్నేహం పేరుతో.. వారి పర్సనల్ లైఫ్ లోకి దూరకూడదు. మీరు బెస్ట్ పేరెంట్ కావాలంటే... మీ పిల్లలకు పర్సనల్ లైఫ్ కి కాస్త స్పేస్ ఇవ్వాలి.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు కాస్త ఎమోషనల్ గా ఉంటారు. అయితే.. పిల్లల దగ్గర కూడా అలా ఉండదు. అవసరమైనప్పుడు పిల్లల దగ్గర.. కాస్త కఠినంగా ఉండటం కూడా నేర్చుకోవాలి.
5.సింహ రాశి...
సింహ రాశికి చెందిన తల్లిదండ్రులు.. పిల్లల విషయంలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. వారిని ఎక్కడికీ వెళ్లనివ్వరు. కానీ..మీరు బెస్ట్ పేరెంట్ అవ్వాలి అంటే.. వారినీ మరీ బంధించకుండా కాస్త వదిలేయాలి. మీ పిల్లలను స్వతంత్రంగా ఎదిగే స్వేచ్ఛ ను ఇవ్వాలి.
6.కన్య రాశి...
కన్య రాశివారు ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. వీరి ఈ పర్ఫెక్షన్ పిచ్చితో... పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లలపై ఎక్కువ భారం పెడుతూ ఉంటారు.అది మానుకోవాలి.
7.తుల రాశి..
తుల రాశివారు.. తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా వీరే నిర్ణయిస్తూ ఉంటారు. వారికి ఏది కావాలో వారిని కనీసం ఆలోచించుకోనివ్వరు. కాబట్టి.. ఈ విషయంలో పిల్లలకు వారి భవిష్యత్తు వారే రాసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశికి చెందిన తల్లిదండ్రులు.. ఎప్పుడూ తమ పిల్లలు ఆ లక్ష్యం సాధించాలి.. ఇది చేయాలి అంటూ చెబుతూ ఉంటారు. వారితో ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు. ఎమోషనల్ బాండింగ్ చాలా తక్కువ. కాబట్టి... ముందు అది పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశికి చెందిన తల్లిదండ్రులకు నోట్లో ఒక మాట కూడా ఆగదు. అన్నీ.. అందరికీ బయటకు చెప్పేస్తూ ఉంటారు. దీని వల్ల పిల్లలకు కొన్ని సందర్భాల్లో ఎంబారిసింగ్ ఉంటుంది. కాబట్టి.. ఆ విషయంలో కాస్త కంట్రోల్ లో ఉండాలి.
10.మకర రాశి..
మకర రాశివారు.. తమ పిల్లలు సమస్యలో ఉన్నప్పుడు కూడా లెక్కలేస్తూ ఉంటారు. కానీ వారు అలా ఉంటే కష్టం. ప్రతిదీ లెక్కలేసుుకుంటూ కూర్చుంటే.. పిల్లల జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన తల్లిదండ్రులు ఒక్కోసారి బండరాయిలాగా, మొండిగా ప్రవర్తిస్తారు. అయితే.. మీ పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే.. ఈ రాశివారు కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి.
12.మీన రాశి...
పిల్లలు తప్పులు చేయడం చాలా సహజం. వాటిని సరిదిద్దే బాద్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అయితే... మీన రాశివారు.. తమ పిల్లలు చేసే తప్పులను డ్రమటైజ్ చేసి.. ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు.