Zodiac sign: ఏ రాశివారు ఎలాంటివారిని ఇష్టపడతారో తెలుసా?

Published : Aug 17, 2022, 11:58 AM IST

వారికి ఎలా ఉంటే నచ్చుతుందా అని నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే... ఎవరికి ఎలా ఉంటే నచ్చుతారో జోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చట. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటివారు నచ్చుతారో ఓసారి చూద్దాం..  

PREV
113
  Zodiac sign: ఏ రాశివారు ఎలాంటివారిని ఇష్టపడతారో తెలుసా?
Love horoscopege 05

మనం ఇష్టపడే వ్యక్తి... మనల్ని కూడా ఇష్టపడితే కలిగే ఆనందమే వేరు. ఈ క్రమంలో చాలా మంది తాము ఇష్టపడిన వారి మనసు గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. వారికి ఎలా ఉంటే నచ్చుతుందా అని నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే... ఎవరికి ఎలా ఉంటే నచ్చుతారో జోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చట. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటివారు నచ్చుతారో ఓసారి చూద్దాం..

213

1.మేష రాశి...
మేష రాశివారికి కాస్త అసహనం ఎక్కువ అనే చెప్పాలి. కాస్త ఓపిక తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తారు. అయితే... ఈ రాశివారిని ప్రేమలో పడేయాలంటే.. మీకు స్పాంటేనియస్ ఉండాలి. స్పాంటేనియస్ ఎక్కువగా ఉండేవారిని మేష రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.
 

313

2.వృషభ రాశి...
ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే.. వారు తమపై పూర్తిగా ఆధారపడేలా ఉండాలని కోరుకుంటారు. తమపై ఆధారపడి ఉండేవారిని.. వృషభ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

413

3.మిథున రాశి..
మిథున రాశివారిని ఆకర్షించడం అంత సులువేమీ కాదు. ఈ రాశివారిని ఆకర్షించాలంటే... ఎదుటివారు చాలా తెలివిగల వారు అయ్యి ఉండాలి. వారి ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉండాలి. అలాంటివారిని మాత్రమే ఈ రాశివారు ఇష్టపడతారు.

513

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే... వారిలో నిజాయితీ  ఎక్కువగా ఉండాలి. నిజాయితీ ఎక్కువగా ఉండేవారిని మాత్రమే ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

613

5.సింహ రాశి..

సింహ రాశివారు నిజానికి అటెన్షన్ సీకర్స్. అందరి దృష్టి తమపై ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే.. వారి యాక్షన్స్ పై  పరిశీలిస్తూ ఉండేవారు కావాలి.

713

6.కన్య..
కన్య రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే... ఎదుటివారిలో మెచ్యూరిటీ ఎక్కువగా ఉండాలి. అన్నింట్లోనూ.. మెచ్యూర్డ్ గా ప్రవర్తించే వారిని కన్య రాశివారు ఇష్టపడతారు.

813

7.తుల..
తుల రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే.. ఎదుటి వారు తమను నిత్యం పొగడ్తలతో ముంచెత్తూ ఉండాలని కోరుకుంటారు. తమను ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తేవారిని ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే... వారు తమకు తగినవారు అనే నమ్మకం కలగాలి. తమ హృదయానికి వీరు మాకు తగిన వ్యక్తి అనిపిస్తేనే ఈ రాశివారు ముందుకు వెళతారు.
 

1013

9. ధనస్సు రాశి...
ధనస్సు రాశివారికి ఎప్పుడూ సరదాగా ఉండటం ఇష్టం. అందుకే.. ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే... వారిలో  చమత్కారం ఎక్కువగా ఉండాలి. చమత్కారంగా ఉండేవారిని ధనస్సు రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

1113

10.మకర రాశి...
మకర రాశివారు ఎవరినైనా ఇష్టపడాలి అంటే... ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి.. ప్రతి విషయానికీ భయపడని వారిని చూస్తే.. మకర రాశివారికి ఎక్కువగా ఇష్టమట.

1213

 11.కుంభ రాశి.....
కుంభ రాశివారు అంత సామాన్యంగా ఎవరినీ ఇష్టపడరు. తమకు ఊహకు అందని విధంగా స్పందించే వారిని ఈ రాశివారు ఇష్టపడారు. తమకు ఊహకు అందేలా చేసేవారిని వీరు పెద్దగా పట్టించుకోరు.

1313

12.మీన రాశి..
మీన రాశివారికి ఎవరైనా నచ్చాలి అంటే.. వారు మంచి ఆలోచనాపరులై ఉండాలి. అలాంటివారిని మాత్రమే మీన రాశివారు ఇష్టపడతారు.

click me!

Recommended Stories