2.సింహ రాశి..
సింహ రాశి పురుషులు ఆడంబరంగా ఉంటారు. వారు బాధ్యతలు స్వీకరించడాన్ని చాలా ఇష్టంగా భావిస్తారు. ఈ రాశివారు తమ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాడు. ఈ రాశివారు తమను తాము అన్వేషించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా, తమకంటూ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామికి బహుమతుల వర్షం కురిపిస్తారు. తమ భాగస్వామిపై అంతులేని ప్రేమ చూపిస్తారు. అతను కొన్నిసార్లు తన ఉత్సాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అతను కలతల నుండి కోలుకోవడానికి సమయం తీసుకున్నప్పటికీ, వారు తాము ఇష్టపడే వ్యక్తిని క్షమించటానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎదుటి వ్యక్తి తమను మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వీరు క్షమించే గుణం కలిగి ఉంటారు.