
1.మేష రాశి..
మేష రాశివారు తమ భాగస్వామి తమను ఏదైనా విషయంలో ఎక్కువగా బాధపెట్టినా, లేదంటే దారుణంగా మోసం చేసినా ఎక్కువగా బాధపడతారు. వెంటనే వీరు కూడా వారి భాగస్వామిని మోసం చేస్తారు. మరొకరితో ఎఫైర్ కూడా పెట్టుకుంటారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా మంచివారు. తొందరగా తమ భాగస్వామిని మోసం చేయాలనే ఆలోచన కూడా వీరికి రాదు. ఎందుకంటే వీరికి కమిట్మెంట్ చాలా ఎక్కువ. జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తారు. వారితోనే జీవితాంతం ఉండాలని అనుకుంటారు. వారిని కాకుండా మరొకరిని జీవితంలోకి రానివ్వరు.
3.మిథున రాశి..
మిథున రాశివారికి ఒకే బంధంలో ఉండటం నచ్చదు. ఒక బంధానికి కమిట్ అయ్యి ఉండటం వీరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, వేరే వారితో ఎఫైర్ పెట్టుకోవడానికి సిద్ధపడతారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు తొందరగా తమ భాగస్వామిని మోసం చేయాలని అనుకోరు. కానీ ఒక వేళ వీరు అలా చేశారు అంటే, వారు ఎంత హర్ట్ అయితేనో తప్ప అలాంటి నిర్ణయం తీసుకోరు.
5.సింహ రాశి..
సింహ రాశివారు కూడా తొందరగా మోసం చేయాలని అనుకోరు. కానీ తమకు ఆ సంబంధం అసవరం లేదు అనే భావన కలిగితే మాత్రం వారు కచ్చితంగా ఆ బంధాన్ని వదిలేస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. వీరు ఒక రిలేషన్ లోకి అడుగుపెట్టే ముందే ఆలోచించి మరీ పర్ఫెక్ట్ పార్ట్ నర్ ని ఎంచుకుంటారు. అందుకే మోసం చేసే ఆలోచన వీరికి రాదు.
7.తుల రాశి..
తుల రాశివారు కూడా కమిట్మెంట్స్ కి ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి, ఈ రాశివారు అంత తొందరగా మోసం చేయాలనే ఆలోచనతో ఉండరు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు మోసం చేయాలని అనుకోరు. కానీ తమ భాగస్వామి తమను మోసం చేస్తే మాత్రం కచ్చితంగా మోసం చేయకుండా ఉండరు. పగ తీర్చుకోకుండా ఉండలేరు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు తమకు తమ భాగస్వామి సరిపోరు అనుకుంటే మాత్రం మోసం చేయడానికి వెనకాడరు. తమ భాగస్వామి తమకు సరైన జోడి కాదు అనిపించినప్పుడు వీరు ఇంకొకరితో ఎపైర్ పెట్టుకుంటారు.
10.మకర రాశి..
మకర రాశివారు అన్నింట్లోనూ ది బెస్ట్ ఉండాలని అనుకుంటారు. సంబంధాల విషయంలోనూ వీరు అదే కోరుకుంటారు. తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పర్ఫెక్ట్ కాదు అనిపిస్తే, మరో పర్ఫెక్ట్ వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు కూడా కమిట్మెంట్స్ కి వాల్యూ ఇస్తారు. మోసం చేయాలని అనుకోరు. కాదు తమ జీవితంలో ఉన్న వ్యక్తి కరెక్ట్ గా లేరని, మరో వ్యక్తి పరిచయం అయితే మాత్రం అప్పుడు మోసం చేసే అవకాశం ఉంది.
12.మీన రాశి..
ప్రస్తుతం ఉన్న రిలేషన్ షిప్ నుంచి తప్పించుకోవడానికి మీన రాశివారు మరో రిలేషన్ లోకి అడుగుపెడతారు. ఈ క్రమంలో వారు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.