హోలీ నాడే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి అన్నీ కష్టాలే..

First Published Mar 20, 2024, 3:43 PM IST

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో హోలీ ఒకటి. అయితే హోలీ నాడే చంద్రగ్రహణం కూడా వస్తుంది. దీని ప్రభావం గ్రహాలపై కనిపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవని జ్యోతిష్యులు అంటున్నారు. 
 

ప్రతి ఏడాది మనం ఫల్గుణ మాసంలో పౌర్ణమి నాడు హోలీ పండుగను  సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 25న వచ్చింది. అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఉంది. అయితే దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి హోలీ నాడు ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కర్కాటకరాశి

జ్యోతిష్యుల ప్రకారం.. కర్కాటక రాశివారిపై చంద్రగ్రహణం చెడు ప్రభావాలను చూపిస్తుంది. అందుకే హోలీ నాడు కర్కాటక రాశివారు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఈ రోజు ఈ రాశివాళ్ల కుటుంబ ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మీరు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో ఆలస్యం చేయకండి. దీనితో పాటుగా మీరు వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు పదోన్నతి పొందాలనుకుంటే షార్ట్ కట్ దారులను ఎంచుకోవడం మానేయండి.
 

వృశ్చిక రాశి 

గ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారు హోలీ నాడు కుటుంబ కలహాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు మీ వృత్తి జీవితంలో కూడా ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో కష్టపడి పనిచేయడంతో పాటుగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి

చంద్రగ్రహణం నాడు కుంభ రాశి  కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.  అనవసరంగా మాట్లాడకండి. మాటలు మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోండి. లేకపోతే మీ పరువు పోతుంది. సంబంధాలు దెబ్బతింటాయి. వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో భారీ నష్టాలు వస్తాయి. 
 

మీన రాశి

ఈ హోలీ మీన రాశివారికి అంత కలిసి రాదు. ఎందుకంటే ఈ రోజు మీనరాశివారి ఆరోగ్యం దెబ్బతినొచ్చు. అందుకే వీళ్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యల వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా కుటుంబ సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. దీని వల్ల మీకు ఒత్తిడి బాగా పెరుగుతుంది.

click me!