ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కోపం చాలా ఎక్కువ..!

First Published | Aug 14, 2024, 4:58 PM IST

మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు విపరీతమైన కోపం. ఈ అమ్మాయిల కోపాన్ని కంట్రోల్ చేయడం అంత సులువు కాదు. మరి.. వాళ్లు ఎవరో చూద్దాం..
 

న్యూమరాలజీ  ప్రకారం.. ఒక వ్యక్తి  వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీని.. మనం పుట్టిన తేదీని పట్టి లెక్కిస్తారు. ఈ క్రమంలో న్యూమరాలజీ ప్రకారం మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు విపరీతమైన కోపం. ఈ అమ్మాయిల కోపాన్ని కంట్రోల్ చేయడం అంత సులువు కాదు. మరి.. వాళ్లు ఎవరో చూద్దాం..

1.న్యూమరాలజీ ప్రకారం.. 9, 18, 27 తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువట. వీళ్ల రూట్ నెంబర్ 9 అని చెప్పొచ్చు. వీళ్లకు చిటికెలో కోపం వచ్చేస్తుంది. వీళ్లకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం.
 



వీళ్లకే కోపం ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే.. ఈ నెంబర్ 9 ని.. మార్స్  రూల్ చేస్తూ ఉంటుంది. మార్స్ గ్రహం కూడా...కోపం, శౌర్యం, ధైర్యానికి ప్రతీక. ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. ప్రతి విషయంలోనూ యుద్ధానికి తాము సిద్ధం అన్నట్లుగానే ఉంటారు. ఇంత కోపం ఉన్నా.. ఈ అమ్మాయిలకు చాలా డిసిప్లెయిన్ గా ఉంటారు.  కానీ.. వారు ఏ పని చేసినా కేర్ లెస్ గా చేసేస్తారు. అంటే.. ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే భయం వీరికి ఉండదు.

ఇక.. ఈ మూడు తేదీల్లో  పుట్టిన అమ్మాయిలు ఆర్థికంగా కూడా వారికి చాలా బాగుంటుంది. ఈ రాశివారు ఆర్థికంగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అయితే.. వీరు ఖర్చు కూడా అలానే చేస్తారు.

ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. తమ కెరీర్ లో ఎక్కువ  సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.  వారి కోపం కారణంగా నే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరికి ఎంత కోపం ఉన్నా...  ఇతరులకు సహాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటారు.  ఎవరైనా అవసరంలో ఉంటే.. వీరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.

ఇక ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కోవలసి వచ్చినా.. వాటిని భయం లేకుండా ఎదుర్కొంటారు. అస్సలు వెనక్కి తగ్గరు. 

Latest Videos

click me!