మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు లాభ స్థానంలో సంచరించి మే నెల నుండి వ్యయ స్థానంలో సంచారము.
శని:- ఈ సంవత్సరమంతా భాగ్య స్థానంలో సంచారము
రాహు:-ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో సంచారము
కేతు:-ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సంచారము
మిధున రాశి వారికి 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆడవాళ్లకు 2024 సంవత్సరం అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిపెడతాయి.కుటుంబ జీవితంలో చికాకులు అంత అనుకూలంగా లేదు. వాదనలు కలుగును. ఖర్చులు పెరుగును. ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం. అనుకోని ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం. వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడును. మనకు అందవలిసిన డబ్బులు రావలసిన సమయానికి రాలేకపోవడం తో ఇబ్బందులు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పులు చేయడం జరుగుతుంది. యువకులు ప్రేమ పరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధముగా సాగేటటువంటి స్థితి గోచరించడం లేదు. అలాగే భార్య,భర్తలు వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రతీ విషయాన్ని హార్ట్ ఫుల్ గా తీసుకుంటే సమస్యలు వస్తాయి. చిన్న వివాదాలను ,మాటపట్టింపులను పెద్దగా సాగతీయకండి. పని ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళ వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించును. ప్రతీ ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు.