వినాయక చవితి 2023: రాశిచక్రం ప్రకారం.. ఈ రంగు గణేషుడిని ప్రతిష్టిస్తే.. ఈ లాభాలను పొందుతారు

Published : Sep 04, 2023, 03:25 PM IST

Ganesh Chaturthi 2023: హిందూ మతంలో ఏ శుభకార్యానికైనా ముందు వినాయకుడిని ఖచ్చితంగా పూజిస్తారు. ఈయన ఆశీస్సులు ఉంటే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. కాగా ఈ ఏడాది వినాయక చతుర్థిని సెప్టెంబర్ 19 న జరుపుకోబోతున్నాం. అయితే రాశిచక్రం ప్రకారం.. వినాయకుడిని ప్రతిష్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.   

PREV
112
వినాయక చవితి 2023:  రాశిచక్రం ప్రకారం.. ఈ రంగు గణేషుడిని ప్రతిష్టిస్తే.. ఈ లాభాలను పొందుతారు
ganesh chaturthi 2023

హిందూ మతంలో.. వినాయకుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడిగా పూజిస్తారు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వినాయకుడు జన్మించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును వినాయకుడి జన్మదిన వేడుకగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి వేడుకను 10 రోజుల పాటు జరుపుకుంటాం. చతుర్దశి రోజున ఈ పండుగ ముగుస్తుంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 19న ప్రారంభమై .. చతుర్దశి రోజైన సెప్టెంబర్ 28న ముగుస్తాయి. మరి వినాయకుడిని ప్రతిష్టించడం వల్ల ఏయే రాశివారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

212
ganesh chaturthi 2023

మేషం

మేష రాశి జాతకులు గులాబి లేదా ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల కార్యాలయంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

312
ganesh chaturthi 2023

వృషభ రాశి

వృషభ రాశి వారు లేత పసుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం మంచిది. ఇది మీ ఇల్లు, మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతాయి. 
 

412
ganesh chaturthi 2023

మిథున రాశి

మిథున రాశివారు లేత ఆకుపచ్చ వినాయకుడి విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకొస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీకు జ్ఞానం, బలం లభిస్తాయి. అలాగే ఇంట్లోని నెగిటివిటీ తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. 

512
ganesh chaturthi 2023 01

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో ప్రతిష్టించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత, ఆనందం నెలకొంటాయి. అలాగే పని రంగంలో మంచి పురోగతిని పొందుతారు.
 

612
ganesh chaturthi 2023

సింహ రాశి

సింహ రాశి వారు సింధూరం రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల అన్ని శుభ ఫలితాలనే పొందుతారు. అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 
 

712
ganesh chaturthi 2023

కన్యా రాశి

కన్య రాశి వారు ముదురు ఆకుపచ్చ వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం శుభప్రదం. ఇది వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది.
 

812
ganesh chaturthi 2023

తులా రాశి

తులా రాశికి అధిపతి శుక్ర గ్రహం కాబట్టి ఈ రాశి వారు లేత నీలం రంగు గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయి. 
 

912

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులు తమ ఇంట్లో లోతైన ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించాలి. ఈ రంగు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.
 

 

1012

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి అధిపతి పసుపు రంగును సూచించే బృహస్పతి గ్రహ దేవుడు. అందుకే ధనుస్సు రాశి వారు తమ ఇంట్లో పసుపు రంగు విగ్రహాన్ని ప్రతిష్టించడం మంచిది. ఇది మిమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తుంది. 
 

1112

మకర రాశి

మకర రాశి జాతకులు లేత నీలం రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశికి అధిపతి శని. కాబట్టి ఈ రంగు విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 
 

1212

కుంభ రాశి

కుంభ రాశి జాతకులు ముదురు నీలం రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతిని శని గ్రహంగా భావిస్తారు. అందుకే ముదురు నీలం వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 
మీన రాశి

మీన రాశికి అధిపతి బృహస్పతి గ్రహం. అందుకే మీన రాశి జాతకులు పసుపు రంగు గణపతిని ప్రతిష్టించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

click me!

Recommended Stories