ఇంట్లో చీపురు ఏ దిక్కున ఉంచాలో తెలుసా?

First Published | Nov 7, 2024, 10:10 AM IST


ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలన్నా, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా..చీపురు విషయంలో కొన్ని నియమాలు ఫాలో అవ్వాలట.

హిందూ మతంలో చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే చీపురును కాళ్లతో తాకకూడదు అని చెబుతుంటారు. అంతేకాదు.. ఇంట్లో చీపురును ఎక్కడ ఉంచాలి? ఎలా ఉంచితే.. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అనే విషయాలను జోతిష్యశాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం…

ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలన్నా, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా..చీపురు విషయంలో కొన్ని నియమాలు ఫాలో అవ్వాలట. ఇంట్లో ఎల్లప్పుడూ చీపురును దక్షిణణ దిశలో లేదంటే పడమర దిక్కులో ఉంచాలట. ఎందుకంటే.. పశ్చిమ దిక్కును లక్ష్మీదేవికి దిక్కుగా భావిస్తారట. చీపురు లక్ష్మీదేవి కి చిహ్నం కాబట్టి.. ఆ దిక్కునే ఉంచాలి. అంతేకాదు.. దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రంలో యమ అంటే మరణాన్ని నివారించడానికి చీపురును ఆ దిశలో ఉంచాలని చెబుతూ ఉంటారట. 


చాలా మంది ఇంటి మెయిన్ డోర్ దగ్గర చీపురు పెడుతూ ఉంటారు.చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించినప్పటికీ , ఇది చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించే వస్తువు. అటువంటి పరిస్థితిలో, ఇంటి ప్రధాన తలుపు వద్ద ఉంచడం వల్ల ఇంట్లో  నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు రావడానికి కారణం అవుతుంది.

చీపురు కొనడానికి ముందు, దాని రంగుపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీరు ఇంటికి చీపురు కొంటున్నట్లయితే, తెలుపు లేదా నీలం చీపురు కొనండి. ఒక వైపు, ఇంట్లోకి తెల్ల చీపురు తీసుకురావడం కుటుంబ శాంతిని కాపాడుతుంది. ఇబ్బందులను తొలగిస్తుంది, మరోవైపు, నీలిరంగు చీపురు సానుకూల శక్తిని పెంచుతుంది.

Looking at the broom

చీపురు కొత్తది అయితే, దానిని ఉపయోగించే ముందు దానిపై గంగా జలాన్ని చల్లాలి. చీపురు దాని మధ్యలో ఎర్రటి గుడ్డతో కట్టాలి. ఇలా చేయడం వల్ల చీపురుకు సంబంధించి ఏదైనా వాస్తు దోషం ఏర్పడితే అది ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. ఇంట్లో శుభం కూడా కలుగుతుంది.

Latest Videos

click me!