
1.మేష రాశి..
ఈ రాశివారు లాంగ్ వీకెండ్ ని ఒక్కరే ఆస్వాదించాలని అనుకుంటారు. దాని కోసం వారు చక్కగా తమకు నచ్చిన మ్యూజిక్ ని ఎక్కువ సౌండ్ తో పెట్టుకొని, తమకు నచ్చిన అన్ని సార్లు కాఫీ తాగడాన్ని ఇష్టపడతారు. మ్యూజిక్ వింటూనే వర్క్ చేస్తారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు వీకెండ్ లో కూడా పాపం ఆఫీసు వర్క్ చేస్తారు. అయితే, బాస్ ఉండడు కాబబ్టి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. ఆఫీసులో కూడా తమకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుంటారు. పాప్ కార్న్ తింటూ వర్క్ చేస్తారు.
3.మిథున రాశి..
మిథున రాశివారికి కోపం ఎక్కువ. ఎవరూ తమను తక్కువ చేయడం వీరికి నచ్చదు. అందుకే ఈ వీకెండ్ లో వారు ఎందులో తక్కువగా ఉన్నారో తెలుసుకొని, దానిపై ఎక్కువ ఫోకస్ పెడతారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరు ఈ లాంగ్ వీకెండ్ లోనూ తమ హెచ్ ఆర్ తో, తమ స్నేహితులతో వర్క్ గురించే మాట్లాడతారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు ఈ లాంగ్ వీకెండ్ లో పెండింగ్ లో ఉన్న ఆఫీస్ వర్క్ పూర్తి చేస్తారు. అదే చేతితో సోషల్ మీడియాలో ఎంగేజ్ అవ్వడం, కొత్త పోస్టులు పెడతారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు ప్రతి సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ లాంగ్ వీకెండ్ లో తనకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, వర్క్ విషయంలో కొత్తవి ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటారు.
7.తుల రాశి..
ఈ రాశివారికి గాసిప్స్ ఎక్కువ ఇష్టం. ఈ సమయంలో ఆఫీసులోని అన్ని గాసిప్స్ తెలుసుకోవడానికి వారి వంతు ప్రయత్నాలు వారు చేస్తారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు తమ హెచ్ ఆర్ చెప్పిన అన్ని పనులు చేసుకుంటూ బిజీగా గడుపుతారు. రోజంతా వారికి అదే పని సరిపోతుంది.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా క్రేజీ పనులు చేస్తారు. వర్క్ తప్పించుకోవడానికి ఏ పనులైనా చేస్తారు. వేరే వాళ్లని ఫ్లర్ట్ చేయడం లాంటివి చేస్తారు.
10.మకర రాశి..
ఈ రాశివారికి వీకెండ్ వేస్ట్ చేయడం నచ్చదు. అందుకే, పని చేయాల్సి వస్తే దానిని తొందరగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత తమ వీకెండ్ ని ఎంజాయ్ చేస్తారు.
11.కుంభ రాశి..
వీకెండ్ లో వర్క్ చేయాల్సి వస్తే, ఈ రాశివారికి చాలా కష్టం. ఆఫీసులో ఎవరూ చూడకుండా నిద్రపోతారు. బాస్ లేని సమయంలో మంచి కునుకు తీస్తారు.
12.మీన రాశి..
ఈ రాశివారు వీకెండ్ లో వర్క్ చేయాల్సి వస్తే, ఆ సమయంలో ఆఫీసుకు వెళ్లక తప్పదు కాబట్టి, అక్కడి నుంచే వీరు ఆన్ లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు.