
1.మేష రాశి..
మేష రాశివారు వారు తీసుకున్న ప్రతి నిర్ణయం బెడిసి కొట్టినప్పుడు, వారు సైలెంట్ అయిపోతారు. ఎంతలా అంటే, వారు ఇతరులతో కనీసం టచ్ లో కూడా ఉండరు.
2.వృషభ రాశి..
వృషభ రాశి వారు తాము ఇతరులకు చెప్పడానికి ఏమీ లేనప్పుడు, వారు సైలెంట్ అయిపోతారు. జీవితంలో అన్ని కోల్పోయినట్లు ఫీలౌపోతారు.
3. మిథున రాశి..
ఈ రాశివారు ఎవరైనా తమను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, ఇదే తరచూ జరుగుతూ ఉంటే ఈ రాశివారు చాలా సైలెంట్ అయిపోతారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు తాము ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో పడినప్పుడు, తాము ఏది చెప్పినా ఎవరూ నమ్మరు అనిపించినప్పుడు ఈ రాశివారు సైలెంట్ అయిపోతారు.
5.సింహ రాశి..
ఎవరైనా తమపై ఎటాక్ చేస్తున్నారు అంటే చాలు ఈ రాశివారు సైలెంట్ అయిపోతారు. ఎటాక్ చేసినప్పుడు సైలెంట్ గా ఉంటేనే మంచిదని వీరు భావిస్తారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు తమకు తాము సమయం కేటాయించాలి అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోతారు. ఎవరితో సంబంధం లేకుండా ఉండి, తమ సమస్యకు పరిష్కరం వెతకాలి అనుకుంటారు.
7.తుల రాశి..
ఈ రాశివారికి ఆందోళన చాలా ఎక్కువ. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, ఏదైనా తప్పుగా జరుగుతోంది అనుకున్నప్పుడు వీరు ఆందోళన చెంది సైలెంట్ అయిపోతారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎవరైనా తమను ద్రోహం చేస్తే దానిని భరించలేరు. ఆ సమయంలో ఈ రాశివారు సైలెంట్ అయిపోతారు. తాము ఎంత మోసపోయాం అని ఆలోచిస్తూ ఉంటారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు తాము చేసిన ఏదైనా తప్పు చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలౌతారు. ఆ సమయంలో వీరు ఏమీ మాట్లాడలేరు. సైలెంట్ గా ఉండిపోతారు.
10.మకర రాశి..
మకర రాశివారు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు వారు వెంటనే సైలెంట్ అయిపోతారు. ఆ సమయంలో వీరు ఏం మాట్లాడటానికి ఇష్టపడరు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి భయం ఎక్కువ. వీరు ఎక్కువగా భయపడినప్పుడు చాలా సైలెంట్ అయిపోతారు. ఆ సమయంలో వీరు ఎవరితోనూ ఏమీ మాట్లాడరు.
12.మీన రాశి..
ఈ రాశివారు ఎవరైనా తమను నిరుత్సాహ పరిచినప్పుడు, బాగా ఫీలైపోయి సైలెంట్ అయిపోతారు. ఎవరైనా తమను బాధపెట్టినప్పుడు ఈ రాశివారు ఎవరితోనూ మాట్లాడటాన్ని ఇష్టపడరు.