ఈ రాశులవారిని దూరం చేసుకుంటే.. తర్వాత మీరే బాధపడతారు..!

Published : Aug 25, 2022, 09:55 AM IST

మనకు పరిచయం అయ్యేవారిలో కొందరు మనతో చాలా ప్రేమగా, అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తూ ఉంటారు. అయితే.. వారు మనకు అందిస్తున్న స్నేహ హస్తాన్ని కొందరు పెద్దగా పట్టించుకోరు. 

PREV
16
ఈ రాశులవారిని దూరం చేసుకుంటే.. తర్వాత మీరే బాధపడతారు..!

మనకు జీవితంలో చాలా మంది పరిచయం అవుతారు. వారిలో కొందరితో మనం జీవితాంతం స్నేహాన్ని కంటిన్యూ చేస్తాం..  కొందరిని మధ్యలోనే వదిలేస్తాం. మనకు పరిచయం అయ్యేవారిలో కొందరు మనతో చాలా ప్రేమగా, అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తూ ఉంటారు. అయితే.. వారు మనకు అందిస్తున్న స్నేహ హస్తాన్ని కొందరు పెద్దగా పట్టించుకోరు. వాళ్ల విలువ తెలీకుండా వారిని వదిలేస్తూ ఉంటారు. కాగా... జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు జీవితాంతం ఎదుటివారికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి... ఈ రాశులను అస్సలు వదులుకోకూడదు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...

26

1.కర్కాటక రాశి...

ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఈ రాశివారు తమ ప్రియమైన వారి కోసం సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తమ స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం అంకిత భావంతో పనిచేస్తారు. ఎవరికీ ద్రోహం చేయాలనే ఆలోచన కూడా వీరికి రాదు. అందుకే.. ఈ రాశివారు మీ జీవితంలో ఉంటే.. వారిని అస్సలు వదులుకోకూడదు.

36

2.కన్య రాశి..

ఈ రాశివారు తమ వారిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అయితే.. ఆ శ్రద్ద మనకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. కానీ... తమ వారి గురించి నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. వారితో చాలా ప్రేమగా ఉంటారు. ఇలాంటి వారు ఎవరి జీవితంలో అయినా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. ఈ రాశివారు ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించరు. అయితే.. ఎవరైనా తమను ఉపయోగించుకొని తర్వాత వదిలేస్తే మాత్రం వీరు తట్టుకోలేరు. ఈ రాశివారు జీవితంలో ఉంటే.. వారిిన అస్సలు దూరం చేసుకోవద్దు.

46

3.తుల రాశి..

ఈ రాశివారు చాలా ఉత్తమంగా ఉంటారు. జీవితంలో తమతో పాటు... తమ చుట్టూ ఉన్నవారు కూడా ఎదగడానికి సహాయం చేస్తారు. వీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతారు.  ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వారు కనుక జీవితంలో లభిస్తే.. వారిని దూరం చేసుకుంటే.. తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి.. ఇలాంటి వ్యక్తులను దూరం చేసుకోవద్దు..
 

56

4.వృశ్చిక రాశి...


వృశ్చికరాశి వారు తమ వారి అందరి పట్ల శ్రద్ద వహిస్తారు. వీరు అందరిపట్ల చాలా విధేయంగా ఉంటారు. ఎవరైనా ఈ రాశివారిని మోసం చేస్తే.. ఎక్కువగా బాధ పడతారు. కానీ.. వారిపై పగ తీర్చుకోవాలని మాత్రం అనుకోరు.  వీరు తమను మోసం చేసినవారిపట్ల కూడా ప్రేమను పంచగలరు. కాబట్టి... వీరిని కూడా దూరం చేసుకోవద్దు.
 

66

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం  వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు ఎట్టకేలకు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. బంధువులతో వివాదాలు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

5.మీన రాశి..

ఈ రాశివారు బంగారు నిధితో సమానం. ఒక్కసారి పోగొట్టుకుంటే.. నిధి మళ్లీ దొరుకుతుందనే గ్యారెంటీ ఉండదు. అలానే.. ఈ రాశివారిని చేజార్చుకుంటే.. మళ్లీ దగ్గరకాలేరు. వీరు.. అందరినీ చాలా ప్రేమిస్తారు. ఈ రాశివారిని దూరం చేసుకుంటే.. జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది.
 

click me!

Recommended Stories