మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. ఒకవేళ చేస్తే?

First Published Dec 7, 2021, 2:38 PM IST

వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత (Uniqueness) ఉంది. అయితే ఈ రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజ గ్రహం పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ కుజ గ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది. కుజుడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు, ఆందోళనలు, ప్రమాదాలు, నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా మంగళవారం రోజున చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం..
 

మంగళవారం రోజు చేయవలసిన పనులు:
మంగళవారం (Tuesday) రోజు శ్రీ ఆంజనేయ స్వామిని (Sri Anjaneya Swami) ధ్యానించాలి. ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు. ఆ స్వామిని స్మరించిన ధైర్యం చేకూరుతుంది. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడంతో కుజగ్రహ ప్రభావం తగ్గి అనేక ఇబ్బందులు తొలగిపోతాయి.

అంతా మంచే జరుగుతుంది. ఈ రోజున కుజ దేవునికి ప్రీతికరమైన ఎరుపు దుస్తులను (Red dress) వేసుకోవాలి. అలాగే ఎరుపు రంగు పూలతో ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. ఇలా చేయడంతో మనకు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. అదే జాతకంలో కుజ గ్రహం (Kuja planet) వక్ర దుస్తుల్లో ఉన్నట్లయితే ఎరుపు వస్త్రాలను ధరించక పోవడమే మంచిది.
 

శత్రువులపై విజయం సాధించడం కోసం కాళికాదేవిని (Kalikadevi) ధ్యానించడం మంచిది. జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగి పోవడానికి ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించాలి. ఇలా ఆంజనేయ స్వామిని పూజించడంతో ఆ స్వామి అనుగ్రహం మన మీద ఉంటుంది. అలాగే ఈ రోజున సుబ్రమణ్య స్వామి (Subramanya Swamy) గుడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసిన అంతా మంచే జరుగును.
 

మంగళవారం రోజు చేయకూడని పనులు: మంగళవారం రోజున కుజగ్రహ ప్రభావం (Effect) ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున చాలామంది శుభకార్యాలను సాధారణంగా మొదలుపెట్టారు. మంగళవారం రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా (Borrow money) ఇవ్వరు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదని నమ్ముతారు.
 

అలాగే డబ్బును అప్పు తీసుకున్నట్లయితే కూడా   అనేక ఇబ్బందులు (Difficulties) ఎదురయ్యాయి తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డబ్బు దానం చేసే విషయంలో దైవకార్యాలకు, విద్య, వైద్య పరమైనటువంటి వాటికి వర్తించవు. మంగళవారం నాడు గోర్లు కత్తిరించుకోవడం (Trimming nails), జుట్టు కత్తిరించు కోవడం వంటి పనులు చేయరాదు.
 

తలంటు స్నానం (Head bath) కూడా చేయరాదు. అలాగే కొత్త బట్టలు కూడా ఈ రోజు ధరించడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. మంగళవారం ఉపవాసం (Fasting) ఆచరించే వారు రాత్రి పూట ఉప్పు వేసిన పదార్థాలను తినకూడదు. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఇష్ట దైవాన్ని ప్రార్థించి ప్రయాణం చేయడం మంచిది.

click me!