ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది.
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.
513
కర్కాటక రాశి ఫలాలు
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
613
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అందుతాయి.
713
కన్య రాశి ఫలాలు
స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
813
తుల రాశి ఫలాలు
మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.
913
వృశ్చిక రాశి ఫలాలు
బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు వస్తాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
1113
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.
1213
కుంభ రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
1313
మీన రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.