Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలసివస్తుంది.. అన్నీ శుభాలే!

Published : Nov 14, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 14.11.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఆదాయం విషయంలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు

నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల డబ్బు ఖర్చవుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు.

813
తుల రాశి ఫలాలు

వ్యాపారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు.

1113
మకర రాశి ఫలాలు

బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుంచి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాల్లో విజయం సాధిస్తారు.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories