
1.మేషం
మేష రాశివారికి కుంభ రాశితో జోడి కడితే వారి జంట చాలా అందంగా ఉంటుంది. ఈ రెండు రాశులకు బాగా సెట్ అవుతుంది.ఈ రెండు రాశులవారికి స్పాంటేనియస్ చాలా ఎక్కువ. అంతేకాదు.. వీరికి క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ. చాలా సరదాగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా ఉంటారు.
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి కర్కాటక రాశివారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశులవారికి ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు. మానసికంగానూ, శారీరకంగానూ వీరు చాలా స్ట్రాంగ్. అందుకే ఈ రెండు రాశుల జోడి బాగుంటుంది.
3.మిథున రాశి..
మిథున రాశివారికి కుంభ రాశివారు బాగా సెట్ అవుతారు. వారిద్దరికీ మానసికంగా కనెక్షన్ బాగా సెట్ అవుతుంది. ఈ రెండు రాశులు ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకోగలరు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి మీన రాశివారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశులు జోడి కడితే.. జంట చాలా ముద్దుగా ఉంటుంది. ఈ రెండు రాశులవారు చాలా సెన్సిటివ్. ఈ రెండు రాశుల వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
5.సింహ రాశి..
సింహ రాశివారికి ధనస్సు రాశి వారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశులవారికి వారికి ఏం కావాలి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. వీరు తమ జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకువెళ్లగలరు.
6.కన్య రాశి..
కన్య రాశివారికి వృషభ రాశివారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశులవారు చాలా కామ్ గా ఉంటారు... భవిష్యత్తు పట్ల లక్ష్యాలను కలిగి ఉంటారు. కాబట్టి... ఈ రెండు రాశుల జోడి చూడ ముచ్చటగా ఉంటుంది.
7.తుల రాశి...
తుల రాశివారికి మిథున రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రాశివారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్ గా ఒకరికి మరొకరు తోడుగా ఉంటారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి కర్కాటక రాశివారు మంచి మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు రాశుల వారు తమ విలువలకు ఎమోషన్స్ కి, ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి మేష రాశివారు మంచి మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు రాశుల అన్ని ఆలోచనలు ఒకేలా ఉంటాయి. వీరు ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తిస్తారు.
10.మకర రాశి...
మకర రాశివారికి వృషభ రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. వీరిద్దరూ ఎదురెదురుగా నిల్చుంటే... అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది. వీరిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. వీరి జంట చాలా చూడ ముచ్చట్టగా ఉంటుంది.
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి మిథున రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు రాశుల జోడి చాలా బాగుంటుంది. వీరి బంధం కూడా చాలా బాగుంటుంది.
12.మీన రాశి..
మీన రాశివారికి వృశ్చిక రాశివారు పర్ఫెక్ట్ జోడి అని చెప్పొచ్చు. ఈ రెండు రాశులవారు ప్రేమను ఎక్కువగా వ్యక్త పరుస్తారు. చాలా రొమాంటిక్ లైఫ్ ని లీడ్ చేస్తారు.