telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు ఎక్కువగా మ్యూజిక్ వినడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో ఈ రాశివారు ఎక్కువ పనిలో ఉన్నా కూడా మ్యూజిక్ వినడానికి ఇష్టపడతారు. అది కూడా బయటకు వినిపించేలా గట్టిగా పెట్టుకుంటారు.
telugu astrology
2.వృషభ రాశి..
ఈ రాశివారికి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. వీరు వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలోనూ వీరు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అయితే, వీరు రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలరు.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారికి కాఫీ తాగడం అంటే ఇష్టం. వీరు ఎప్పుడూ చూసినా, వర్క్ సమయంలో కాఫీ తాగుతూనే ఉంటారు.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ప్రశాంతంగా ఉండటం చాలా ఇష్టం. ఎవరైనా ఎక్కవ శబ్దం చేయడం, మ్యూజిక్ పెట్టడం లాంటివి చేస్తే, వెంటనే ఫిర్యాదు చేస్తారు.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశివారు చాలా తెలివిగలవారు. వారు పనిచేసినా చేయకపోయినా, ప్రమోషన్ మాత్రం సాధిస్తారు. దాని కోసం తమ బాస్ ని కాకపడుతూ ఉంటారు.
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశివారు వర్క్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. వీరు ఇచ్చిన పని చక్కగా చేస్తారు. అంతేకాకుండా వీరు పని మొదలుపెడితే, పనిమీదే దృష్టి పెడతారు. మొయిల్స్, ఎంత వర్క్ పూర్తి చేస్తారు అని చెక్ చేసుకుంటూ ఉంటారు.
telugu astrology
7.తుల రాశి..
తుల రాశివారు పని నేర్చుకోవడానికి తమ సీనియర్స్ తో కలిసి మాట్లాడుతూ ఉంటారు. వారితో కలిసి మాట్లాడి, వారి దగ్గర పని నేర్చుకుంటారు.
telugu astrology
8వృశ్చిక రాశి..
ఈ రాశివారు వర్క్ చేసినప్పుడు కూడా వేరే ఇతర కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం ఈ రాశివారు వర్క్ మధ్యలో ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు పని ఎగ్గొట్టి, ఇతరులతో ముచ్చట్లు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు పని ఎగ్గొడదామా అని చూస్తూ ఉంటారు.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు మంచి బాస్ అవుతారు. వీరు తమ కింది ఉద్యోగులకు పనులు ఇస్తూ ఉంటారు. దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు.
telugu astrology
11.కుంభ రాశి..
ఈ రాశివారికి నిద్ర చాలా ఎక్కువ. వర్క్ పక్కన పెట్టేసి, డెస్క్ మీద నిద్రపోతూ ఉంటారు. లేదంటే కనీసం ఆవలిస్తూ ఉంటారు
telugu astrology
12.మీన రాశి..
వీరు చేసే పని తక్కువ. హడావిడీ ఎక్కువ. పని చేయడం మానేసి, ఎప్పుడూ ఏదో ఒకటి సర్దూతూ ఉంటారు.