డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ నెలలో నూతన వాహన కోరిక ఫలించును. వ్యాపార వ్యవహారములలో జయం. ధన సమస్యలు తొలగును. యువకులకు విద్యా పరమైన లాభములు ప్రాప్తించును. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభింస్తుంది. ఉపకార వేతనాలు లభిస్తాయి. పితృ వర్గం వారి నుండి ఎదురుచూస్తున్న సహాయం లభించును. మాసం ద్వితీయ అర్ధ భాగంలో ప్రయాణాలు ఏర్పడును. తలపెట్టిన ప్రయాణాలు లాభించును. సక్రమంగా ఆలోచించ గలుగుతారు. ఉద్యోగ జీవనంలో సామాన్య యోగం. మాసాంతంలో కుటుంబ పరిస్థితులలో నూతన వ్యక్తుల ప్రవేశ సూచనలు కలవు. ఈ రాశి మహిళలకు వారి పేరు మీద చక్కటి భూ సంపద ఏర్పడు యోగము కలదు. ఈ మాసంలో 4, 7, 10, 19.21 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ నెలలో వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. సోదర వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. 10వ తేదీ తదుపరి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. విదేశీ విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపుర్వక లాభం ఏర్పడును. ఈ మాసంలో 2, 3, 8, 13 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ఈ మాసం మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ నెలలో వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో అపసృతులకు అవకాశం ఉన్నది. ఆర్ధిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఋణ విముక్తులు అగుదురు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశములు తిరిగి లభించును. సులభంగా పనులను పూర్తీ చేయగలరు. స్త్రీ లకు ముత్రపిండ వ్యాధుల సూచనలు కలవు. మృగశిరా నక్షత్ర జాతకులకు ఆఖస్మిక వాహన మరమత్తుల సంబంధ వ్యయం. కుటుంబ విషయాలలో భాత్రు వర్గంతో మైత్రి తగ్గును. నూతన వ్యాపకాలు అలవడును. నూతన ఆలోచనలు స్పురిస్తాయి. స్నేహ వర్గాలలో ఒకరికి సంబందించిన దుర్వార్త తెలుసుకుంటారు. ఈ మాసంలో ఉత్తర దిశలో చేసే ప్రయాణాలు మంచి లాభపురితంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ నెలలో నూతన వ్యవహారాలు ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కుటుంబంలో ఒక తీవ్ర నష్టం ఏర్పడుటకు సూచన ఉన్నది. మిశ్రమ ఫలితాలను ఏర్పరుస్తుంది. పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకొంటారు. మిత్రుల మాట అతిగా విని నష్టపోతారు. దురలవాట్ల వలన ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఎదో ఒక విధంగా అవసరాలకు తగిన ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది. ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలు మరియు ఆశభంగములు ఏర్పడును. భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ నెలలో వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు బాగా లాభపడతారు. వృత్తి పరమైన వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఉద్యోగ జీవనంలో ఇబ్బందులు తొలగును. లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయగలుగుతారు. మీ సామర్ధ్యం పై నమ్మకముంచండి. 8, 9, 10 మరియు 11 తేదీలలో నూతన అవకాశములు, అధికారుల ప్రోత్సాహం లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభించును. క్రమంగా అభివృద్ధి ఏర్పడుతుంది. మఖా నక్షత్ర జాతకులకు జూదం వలన పెద్దమొత్తంలో నష్టములు ఏర్పడును. కుటుంబ జీవనంలో ఆశించిన ఫలితాలు ఏర్పడును. సంతానానికి భవిష్యత్ నిధిని ఏర్పాటు చేయగలుగుతారు. అనుకూలమైన శుభాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ నెలలో ఆరోగ్య విషయాలు క్రమ క్రమంగా మేరుగవును. శత్రు విజయాలు లభిస్తాయి. దగ్గర వారి ప్రమేయంతో సమస్యలకు పరిష్కారం పొందుతారు. నూతన వస్తువులు అమరుతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహరాదులు సామాన్యం. ధనాదాయం సామాన్యం. వ్యక్త్రిగత జీవనంలో అనాలోచిత ఖర్మలు చేయుదురు. పాప-పుణ్య విచక్షణ అవసరమగును. ఆకస్మిక ప్రయాణ లాభాలున్నాయి. విదేశీ నివాస సంబంధ వ్యవహారాలలో శుభవార్త. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో అధికారుల వలన వేధింపులు, ఒత్తిడి పెరుగు సంఘటనలు. వ్యక్త్రిగత జీవితంలో సౌఖ్యం తగ్గును. ముఖ్యంగా భాత్రు వర్గం వలన మానసిక అశాంతి. కుటుంబ పరంగా భూ లేదా స్థల సంబంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు అధికం. నేత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులున్నాయి. 13 నుండి 18 వ తేదీ మధ్య కాలంలో గౌరవం దెబ్బతినును. జీవన దారిలో సమస్యలు ఎదురగును. 29, 30 తేదీలలో ఆరోగ్య సమస్యలు వలన ఖర్చులు, నిరాశాజనక వాతావరణం. అశుభ వార్తలు వినవలసి వచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ నెలలో అందరి మన్ననలను పొందుతారు. గృహంలో ఆకస్మిక శుభకార్యములు , విందు భోజనములు, అతిధుల ఆతిధ్య సంబంధిత వ్యయం ఎదుర్కొందురు. నూతన పరిచయాలు లాభించును. ఈ మాసంలో ప్రారంభ రోజులలో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు గురు గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత శుభవార్త. మాసాంతంలో ఆశించిన ఫలితాలు ఏర్పడుతాయి. మొత్తం మీద ఈ మాసంలో ఆదాయం కన్నా వ్యయం అధికం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ నెలలో కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక వలన ఆనందకర సమయం. అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన కార్యములు ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతి. వ్యాపారములు విస్తరించే అవకాశములు లభించును. తృతీయ వారంలో వ్యక్తిగత జీవనంలో సమస్యలు అన్ని తొలగును. చివరి వారంలో . 26, 28, 30 తేదీలలో చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను కలిగించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు పశు,పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ నెలలో శత్రువులపై విజయం పొందుతారు. ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు జయం చేకురును. వ్యక్త్రిగత జీవనంలో సంతోషకర సంఘటనలు ఏర్పడును.కొద్దిపాటి గర్వం ప్రదర్శిస్తారు. తలపెట్టిన పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ద్వితీయ తృతీయ వారములలో అనేక ఆటంకములతో విదేశీ ఉద్యోగ ప్రయత్నములు సఫలం అగును. కుటుంబ వ్యవహారములలో మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. మీ మాటతీరు సమస్యలను ఏర్పరచును. చివరి వారంలో శ్రమ అధికం మరియు ఉద్యోగ జీవనంలో అనిశ్చిత వాతావరణం. ఈ మాసంలో 10, 11, 18, 25, 26 తేదీలలో చేయు ప్రయాణాలు కలసిరావు. నూతన కార్యాకలాపాలు ప్రారంభించకండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ నెలలో గృహ సంబంధ క్రయవిక్రయాలందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసంలో ఆలోచనలు సక్రమంగా ఉండును. కార్య భారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహకారం పొందుతారు. అనుకూలమైన ఫలితాలు కలుగచేయు మాసం. చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. ఆశించిన విధంగా ధనదయం లభిస్తుంది. గత కాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభించును. తృతీయ వారంలో మాతృ వర్గీయులతో ఆర్ధిక సంబంధ విషయాలందు విభేదాలు ఏర్పడును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వ్యక్తిగత జీవనం ఆనందకరంగా కొనసాగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ నెలలో ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడుదురు.వ్యక్త్రిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడును. కుటుంబంలో అనవసరమైన కలహములు ఏర్పడి అపకీర్తి పొందుతారు. తృతీయ వారం వరకూ కార్య విఘ్నములు ఏర్పడుచుండును. 18, 19 తేదీలలో ప్రయాణములలో ప్రమాద సూచన. జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కాలం అంతగా కలసి రాదు. ధనాదాయం సామాన్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.