ఈ రాశివారు రూల్స్ ఎప్పుడూ ఫాలో అవ్వరు..!

Published : Mar 19, 2022, 10:41 AM IST

 ఎవరు ఏం చెప్పినా వినరు కూడా. అలా.. ఒక్కరూల్ కూడా పాటించకుండా.. ఎవరిమాట వినని కొన్ని రాశిచక్రాలు ఉన్నాయట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..  

PREV
15
ఈ రాశివారు రూల్స్ ఎప్పుడూ ఫాలో అవ్వరు..!
Daily Horoscope

ప్రతి దాంట్లో ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని కొందరు తప్పనిసరిగా ఫాలో అవుతారు. కానీ. కొందరు ఉంటారు... ఏ ఒక్కరూల్  కూడా సరిగా ఫాలో అవ్వరు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినరు కూడా. అలా.. ఒక్కరూల్ కూడా పాటించకుండా.. ఎవరిమాట వినని కొన్ని రాశిచక్రాలు ఉన్నాయట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

25

1.మిథున రాశి..
ఈ రాశివారు ఎవరి మాట వినరు. వీరి చర్యలు, మాటలు చాలా అనూహ్యంగా ఉంటారు. ఇతరుల అంచనాలకు కట్టుబడి ఉండరు. వారికి నచ్చినవి మాత్రమే చేస్తుంటారు. ఎలాంటి రూల్స్ కూడా వీరు పాటించరు. ఎవరైనా చెప్పినా కూడా వీరు వినరు.  తమకు నచ్చిందే చేస్తుంటారు. ఎక్కువగా.. తప్పులు చేస్తుంటారు

35

2.మీన రాశి..
ఈ రాశివారు వారి అంతర్ దృష్టిని అనుసరిస్తారు. ఈ రాశివారు ఎదుటివారు పెట్టిన రూల్స్ ని అస్సలు ఫాలో కారు. మీనరాశి వారు సంతృప్తిగా ఉన్నంత వరకు, వారి చర్యల  పరిణామాల గురించి పట్టించుకోరు. అన్నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. రూల్స్ ని మాత్రం వీరు ఫాలో కారు. ఎవరో చెప్పింది మేముందుకు చేయాలి అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది.

45

3.మేష రాశి..
ఈ రాశివారు చాలా మొండి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  ఈ వారు కూడా చాలా హఠాత్తుగా ఉంటారు . ఇతరులు ఏమి చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి వీరు అసలు పట్టించుకోరు.. మేషం వారు కోరుకున్నది మాత్రమే చేస్తారు. వారి హృదయాన్ని అనుసరిస్తారు. తప్పు చేసే విషయంలో పెద్దగా ఆలోచించే వారు కాదు.

55

4.ధనస్సు రాశి..
వారు రూల్‌బుక్‌లో లేని పనులను చేయడంలో థ్రిల్  ఉందని వీరు నమ్ముతారు. సాహసాన్ని ఇష్టపడతారు. వారు నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంది . ఎల్లప్పుడూ సరదాగా ఉంటారు. వారు ఇతరుల మాదిరిగానే అదే మార్గంలో వెళ్లడం అలవాటు చేసుకోలేరు. అందరికంటే భిన్నంగా చేయాలి అని అనుకుంటారు.

click me!

Recommended Stories