1.మేష రాశి..
మేష రాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాంటివారికి సూర్యుడు నక్షత్రం మార్చుకోవడం వల్ల.. ఆ రాశివారిలో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఉద్యోగాల పరంగా అద్భుతంగా జరగనుంది. మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది.
మేష రాశి వారు బలమైన ఆర్థిక స్థితిని కలిగి ఉంటారు. పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. వారు తమ భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. విద్యార్థులకు ఈ సమయం మంచిది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. పని పట్ల మక్కువ ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.