2024 లో ఈ రాశుల వారికి గడ్డుకాలం.. జాగ్రత్తగా లేకపోతే అంతే..

Published : Dec 20, 2023, 10:33 AM IST

2024 లో కొన్ని రాశుల వారికి అంతా మంచే జరిగితే మరికొన్ని రాశుల వారికి మాత్రం గడ్డుకాలం ఉంటుంది. మరి కొత్త ఏడాదిలో జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..  

PREV
14
2024 లో ఈ రాశుల వారికి గడ్డుకాలం.. జాగ్రత్తగా లేకపోతే అంతే..
Shani

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి రెండున్నరేండ్లు పడుతుంది. దీన్ని శనిపెయర్చి ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు శని మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంగా శనీశ్వరునికి  ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అలాగే సహస్రనామ అర్చన, తిలదీప పూజ, అష్టోత్ర అర్చన నిర్వహిస్తారు. కాగా మరో రెండేంళ్లు కుంభరాశిలో ఉండే శనిభగవానుడి వల్ల ఎలాంటి  దుష్పలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24
Aries daily horoscope

మేష రాశి 

శనీశ్వరుడు ఈ రాశిలో 11వ ఇంటిని పరిపాలిస్తున్నాడు. అందుకే మేష రాశి వారు కొత్త ఏడాదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మీరు మంచి నిర్ణయాలను తీసుకోలేకపోతారు. మీరు మీ శారీరక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి చెమట పట్టడానికి ప్రతి రోజూ వ్యాయామం చేయండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వాటి లాభనష్టాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. 
 

34
Scorpio Zodiac

వృశ్చికం

ఈ రాశి వారి 4వ ఇంట్లో శని సంచారం ఉంటుంది. వృశ్చిక రాశి కొత్త సంవత్సరంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వెన్నునొప్పి, మడమనొప్పి వంటి సమస్యలను మిమ్మల్ని బాధిస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అనవసరమైన పనులు చేస్తారు. అందుకే పొదుపుగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొన్ని ఖర్చులు చేస్తారు. అందుకే ఆహారమే ఔషధమని అర్థం చేసుకుని మంచి ఫుడ్ ను తీసుకోండి. సోమరితనంగా ఉంటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. 
 

44
Daily Aquarius Horoscope

కుంభ రాశి

ఈ రాశి మొదటి ఇంట్లో శని సంచారం. 2024 లో ఈ రాశివారు రవాణా కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ఈ రాశివారు లెక్కలేనన్ని ఖర్చులు చేస్తారు. మే నెల తర్వాత కుంభ రాశి వీరికి గురువు కళ్ల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే వీరు సరైన నిర్ణయం తీసుకోలేరు. అలాగే మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు ప్రతి రోజూ వ్యాయామం చేయడం మంచిది. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories