వంగవీటి రాధాకు దక్కని టీడీపి సీటు: చంద్రబాబు వ్యూహం ఇదే...

First Published Mar 19, 2019, 12:00 PM IST

హైడ్రామా మధ్య తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ‌కు ఆ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ జాబితాల్లో ఎక్కడా స్థానం లభించలేదు. 

హైడ్రామా మధ్య తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ‌కు ఆ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ జాబితాల్లో ఎక్కడా స్థానం లభించలేదు.
undefined
ఆయనకు బందరు పార్లమెంట్, అవనీగడ్డ, నరసాపురం పార్లమెంట్ స్ధానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అంచనాలకు అందకుండా చంద్రబాబు.. వంగవీటిని పక్కనపెట్టేయడంతో ఆయన అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
undefined
అయితే రాజకీయ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు.. రాధను పోటీకి నిలబెట్టకపోవడం వెనుక వేరే వ్యూహం వుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఎన్నికల్లో టీడీపీకి అదనపు బలంగా మార్చాలని బాబు ఎత్తుగడ.
undefined
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్ల కాపుల ఓట్లు టీడీపీకి పడ్డాయి. అయితే ఈ సారి పవన్.. తెలుగుదేశం పార్టీకి దూరమవ్వడం, జనసేనను ఎన్నికల బరిలోకి దింపడంతో ఆ సామాజిక వర్గం మొత్తం జేఎస్పీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
undefined
ఈ నష్టాన్ని పూడ్చేందుకు గాను గత ఎన్నికల్లో తనకు విజయాన్ని అందించిన ఉభయగోదావరి జిల్లాల్లో వంగవీటి రాధా చేత ప్రచారం చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు
undefined
ఈ ఎన్నికల్లో తనతో పాటు స్టార్ క్యాంపెయినర్‌గా వంగవీటిని రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి ప్లాన్. వ్యూహాత్మకంగా రాధాను పోటీకి దూరంగా ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
undefined
అయితే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటే అనుచరులు దూరమవుతారని రాధా భయపడుతున్నారు. ఇది తన సుధీర్ఘ రాజకీయ జీవితంపైనా ప్రభావం చూపవచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి రాధా విషయంలో చంద్రబాబు వ్యూహామేంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే
undefined
click me!