అన్నయ్య కన్నా తమ్ముడు ఘోరం: ఒకే ఒక్కడు, పవన్ కాదు

First Published May 23, 2019, 6:57 PM IST

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మెగాస్టార్  చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని ఏపీ ఓటర్లు అక్కున చేర్చుకొన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఆ ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్  2014 ఎన్నికలకు ముందు జనసేనను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన చీఫ్  పోటీ చేసిన రెండు స్థానాల్లో  ఓటమి పాలయ్యాడు. రాజోలు నుండి పోటీ చేసిన ఆ పార్టీ ఒక్కరే విజయం సాధించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి, పాలకొల్లు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డిపై చిరంజీవి విజయం సాధించారు.
undefined
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి బంగారు ఉషారాణి చేతిలో చిరంజీవి ఓటమి పాలయ్యారు. స్వంత నియోజకవర్గంలోని పాలకొల్లులో చిరంజీవి ఓటమి పాలయ్యాడు.
undefined
2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశాడు. 2008 ఆగష్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రకటించారు. 2009 ఎన్నికల సమయంలో దేవేందర్ గౌడ్ నేతృత్వంలోని నవ తెలంగాణ పార్టీ కూడ పీఆర్పీలో విలీనమైంది.
undefined
2009 ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయాడు. 2011 ఎన్నికల్లో పీర్పీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ సమయంలో యువరాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
undefined
2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరపున పాలకపక్షాన్ని ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
undefined
2014 లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయమై కేంద్రం మాట మార్చడం.... ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఈ విషయమై ఏపీలోని పలు చోట్ల సదస్సులు నిర్వహించారు.
undefined
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కూటమిని ఏర్పాటు చేసి పోటీ చేశారు. ఈ కూటమి ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. రాజోలు లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాత్రం ఓటమి పాలయ్యాడు.
undefined
click me!