పక్కా లోకల్: చంద్రబాబు 'పీకే' లగడపాటి రాజగోపాల్

First Published Mar 15, 2019, 10:58 AM IST

అమరావతి: తన ఎన్నికల వ్యూహకర్తగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ జగన్ కోసం సర్వేలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహరచన చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తున్నారు.

అమరావతి: తన ఎన్నికల వ్యూహకర్తగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ జగన్ కోసం సర్వేలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహరచన చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తున్నారు
undefined
ఎన్నికల్లో ప్రతి పార్టీకి వ్యూహకర్తల అవసరం ఏర్పడుతూ వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అటువంటి వ్యూహకర్త ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబు కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది
undefined
లగడపాటి రాజగోపాల్ సర్వేల్లో తెలంగాణ సర్వే ఫలితాలు తప్పు మిగతా సర్వేలన్నీ దాదాపుగా నిజమవుతూ వచ్చాయి. సర్వేలు చేయించడంలో ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ నిర్దిష్టంగా వ్య.వహరిస్తారనే పేరుంది. దాంతో చంద్రబాబుకు లగడపాటి రాజగోపాల్ వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
లగడపాటి రాజగోపాల్ స్థానికుడు కావడంతో స్థానిక పరిస్థితులు, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాలను అంచనా వేయడంలో తగిన ఫలితాలు సాధిస్తారని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సలహాలు తీసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తోంది.
undefined
తెలంగాణ సర్వే తప్పు కావడం వెనక కారణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. పోలింగ్ ను ప్రభావితం చేయడానికి లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు ప్రోద్బలంతో తప్పుడు ఫలితాలను వెల్లడించారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, తన ఫలితాలు తప్పు కావడానికి మరో కారణం ఉందని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు కారణం చెబుతానని లగడపాటి రాజగోపాల్ అంటున్నారు
undefined
చంద్రబాబుకు సలహాలు ఇవ్వడమే కాకుండా నాయకులను పార్టీలోకి రప్పించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లడానికి తటపటాయిస్తున్న వంగవీటి రాధాను వెంట పెట్టుకుని చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లింది లగడపాటి రాజగోపాల్ కావడం విశేషం. ఆ తర్వాతే టీడీపిలో చేరడానికి వంగవీటి రాధ సిద్ధపడ్డారు
undefined
ఎన్నికల హడావిడి ప్రారంభమైన తొలినాళ్లలో లగడపాటి రాజగోపాల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో కలిసి రాత్రిపూట చంద్రబాబును కలిశారు. రాధాకృష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే విషయంలో దాపరికం ఏమీ లేదు. అప్పుడే లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు వ్యూహకర్తగా పనిచేయడానికి తగిన ఏర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు.
undefined
click me!