మంగళగిరి సీటు చరిత్ర ఇదీ: అందుకే లోకేష్ పోటీ

First Published Mar 13, 2019, 4:16 PM IST

గుంటూరు: ఏపీ మంత్రి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు ముగింపు పలికించారు సీఎం చంద్రబాబు నాయుడు. లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. 
 

గుంటూరు: ఏపీ మంత్రి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు ముగింపు పలికించారు సీఎం చంద్రబాబు నాయుడు. లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
undefined
నారా లోకేష్ గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు, గుంటూరు జిల్లా నుంచి పెద్దకూరపాడు, విశాఖపట్నం నుంచి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది.
undefined
అయితే అనేక కోణాల్లో చర్చించిన చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నారా లోకేష్ ను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని నిర్ణయించారు. దీంతో నారా లోకేష్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
undefined
ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నారా లోకేష్ రాష్ట్ర కేబినేట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. నారా లోకేష్ ను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యించడానికి చాలా కసరత్తు చేశారని తెలుస్తోంది.
undefined
2014 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతోనే గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే గెలుపొందారు.
undefined
ఆర్కే 88, 977 ఓట్లు సాధించగా టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి 88965 ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో టీడీపీ చాలా బలపడిందని చంద్రబాబు నాయుడు సర్వేలో తేలింది.
undefined
వైసీపీ ఎమ్మెల్యే ఉండటంతో అక్కడ అభివృద్ధి నామ మాత్రంగా జరిగే అవకాశం ఉంటుందని, ఆయనపై వ్యతిరేకత కలిసి వస్తోందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇకపోతే నారా లోకేష్ ను రాజధాని ప్రాంతం నుంచి పోటీ చెయ్యించాలంటూ అత్యధిక శాతం పార్టీ శ్రేణులు చంద్రబాబును కోరారు.
undefined
దీంతో చంద్రబాబు నాయుడు లోకేష్ ను మంగళగిరి నుంచి బరిలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మంగళగిరి నియోజకవర్గంలోనే నారా లోకేష్ ఓటు ఉండటం దానికి కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.
undefined
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కేవలం ఇప్పటి వరకు రెండుసార్లు పోటీ చెయ్యగా ఒకసారి ఉపఎన్నికల్లో పోటీ చేసింది. టీడీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో నారా లోకేష్ మూడోవ్యక్తిగా చెప్పుకోవచ్చు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోటేశ్వరరావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయిపాటి శ్రీనివాస్ పై గెలుపొందారు.
undefined
అప్పటి వరకు మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేసింది లేదు. దీంతో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేసిన మెుట్టమెుదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే 1985లో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సినీనటి జమునపై కోటేశ్వరరావు మళ్లీ గెలుపొందారు.
undefined
1989 వరకు కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆతర్వాత మళ్లీ 2014లో టీడీపీ పోటీకి దిగింది. తొలిసారిగా పోటీ చేసినప్పుడు టీడీపీ అఖండ విజయం సాధించినప్పటికీ రెండోసారి 2014లో పోటీ చేసినప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. కేవలం 12 ఓట్ల దూరంతో ఎమ్మెల్యే పదవిని చేజార్చుకుంది.
undefined
ఈసారి ఎలాగైనా మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను బరిలోకి దించారని తెలుస్తోంది. నారా లోకేష్ అమరావతిలోనే ఉంటున్న నేపథ్యంలో మంగళగిరి సీటు అయితే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవచ్చునని భావిస్తున్నారు.
undefined
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినా రాత్రికి ఇంటికి వచ్చేసరికి కార్యకర్తలతో సమావేశాలు అయినా నిర్ణయించుకునే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు.
undefined
అంతేకాదు రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం కావడంతో రాజధాని నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇకపోతే నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతం మంది ఉన్నారు
undefined
నియోజవకర్గంలో గెలుపును నిర్ణయించేది బీసీ సామాజిక వర్గమేననడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని ప్రచారం కూడా ఉంది. టీడీపీని ఆదరించేది బీసీ సామాజిక వర్గాలే అని సాక్షాత్తు సీఎం తనయుడు భావి సీఎం పోటీ చేస్తున్న తరుణంలో కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో చంద్రబాబు లోకేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
undefined
ఇకపోతే అటు మంగళగిరి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీలో గందరగోళం నెలకొంది. ఆర్కే తిరిగి పోటీ చెయ్యరంటూ వార్తలు ప్రచారంలోకి రావడంతో ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
undefined
దీంతో ఆయన అనుచరులు, అభిమానులు లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. అయితే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మంగళగిరి టికెట్ ఆళ్ల రామకృష్ణారెడ్డికేనని ప్రకటించడంతో ఆయన అజ్ఞాతం వీడారు. దీంతో ఆర్కేకు రూట్ క్లియర్ అయిపోయింది.
undefined
ఆర్కే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజధాని భూముల విషయంలోనూ, ఓటుకుకోట్లు కేసులోనూ, డీజీపీ భూమి విషయంలోనూ పలు కేసులు వేసి తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడును ముప్పతిప్పలు పెట్టారు ఆర్కే.
undefined
అంతేకాదు అధికారంలో లేకపోయినా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే ముందే రూ.4కే భోజనం, రూ.2కే ఏ కూరగాయలు అయినా కేజీ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో సాధారణ పౌరులకు మరింత చేరువయ్యారు.
undefined
అంతేకాదు ఆర్కే తానే స్వయంగా పంటలు పండించడం తానే స్వయంగా అమ్మడం వంటి చేస్తూ ఎమ్మెల్యేగా ఏనాడు పొగరుగా వ్యవహరించలేదంటూ ఆ నియోజకవర్గంలోని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ కలుపుకుపోతూ ఉంటారని నియోజకవర్గంలో టాక్.
undefined
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ధీమాగా ఉన్నారు.
undefined
కేసులతో కోర్టుల చుట్టూ తిప్పి ముప్పు తిప్పలు పెట్టిన ఆర్కేను ఈసారి ఇంటికే పరిమితం చెయ్యాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. అటు సీఎం తనయుడు, సీఎంకు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే పోటీలో ఉండటంతో రాబోయే ఎన్నికలు మంగళగిరిలో టగ్ ఆఫ్ వార్ అనడంలో ఎలాంటి సందేహమే లేదు.
undefined
ఇకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తోందని మంగళగిరి నియోజకవర్గం నేతలు ఆశతో ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
undefined
అయితే అనూహ్యంగా సీఎం తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తెరపైకి రావడంతో మంగళగిరిలో రసవత్తరపోరు జరిగే అవకాశం ఉంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరగనుందని అంతా చర్చించుకుంటున్నారు. మంగళగిరిలో పాగా వేసేది నారా లోకేష్ లేక ఆర్కేనా అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.
undefined
click me!