రెంటికి చెడ్డ రేవడి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

First Published Mar 4, 2019, 1:01 PM IST

 వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది.

వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.సర్వేలను ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని టీడీపీ చీఫ్ భావిస్తున్నారు. గెలుపు గుర్రాల వైపే బాబు మొగ్గు చూపే అవకాశం కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
undefined
రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహిస్తున్నారు. వైసీపీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అయితే వీరిలో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. మిగిలినవారంతా టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని చంద్రబాబునాయుడు తన కేబినెట్లోకి తీసుకొన్నారు.
undefined
కడప జిల్లా నుండి ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అయితే జమ్మలమడుగు సీటు విషయమై మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి మధ్య ఒప్పందం కుదిరింది. రామసుబ్బారెడ్డి మరోసారి జమ్మలమడుగు నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నాడు. కడప ఎంపీ స్థానం నుండి మంత్రి ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగుతున్నారు.
undefined
విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి విజయం సాధించిన సుజయకృష్ణారంగారావుకు బాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే సుజయకృష్ణా రంగారావు టిక్కట్టు విషయమై బాబు ఇంకా స్పష్టత ఇవ్వలేదనే ప్రచారం సాగుతోంది.
undefined
పాడేరు నుండి గిడ్డి ఈశ్వరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుండి మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజుల పేర్లను కూడ టీడీపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. రంపచోడవరం నుండి పంతల రాజేశ్వరీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో పంతల రాజేశ్వరీ‌తో పాటు చిన్నం బాబురావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్లను కూడ పరిశీలిస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined
ప్రత్తిపాడు నుండి పరుపుల సుబ్బారావుతో పాటు ఆయన మనవడు రాజా పేరును కూడ టీడీపీ నాయకత్వం పరిశీలిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి జలీల్‌ఖాన్‌కు బదులుగా ఆయన కూతురు పోటీ చేసే ఛాన్స్ కన్పిస్తోంది. అయితే ఈ స్థానాన్ని నాగుల్ మీరా కూడ కోరుతున్నారు.
undefined
శ్రీశైలం స్థానంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడ పోటీకి ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది. పాణ్యం నుండి గౌరు చరితారెడ్డికి టీడీపీ టిక్కెట్టు ఇవ్వనుండడంతో ఏరాసును శ్రీశైలం నియోజకవర్గాన్ని మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
కోడుమూరులో మణిగాంధీకి సీటు విషయంలో ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తోంది. కోడుమూరులో మణిగాంధీకి బదులుగా మరోకరికి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కదిరి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్‌బాషా స్థానంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌‌ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పామర్రు నుండి ఉప్పులేటి కల్పన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్తానంలో డీవై దాస్, వర్ల రామయ్య పేర్లు కూడ పరిశీలనలో ఉన్నాయి.
undefined
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారికి ఇబ్బందులు ఉండకపోయేవి. నియోజకవర్గాల పునర్విభజన చేయబోమని కేంద్రం తేల్చేసింది. దీంతో టీడీపీ నాయకత్వానికి టిక్కెట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది.
undefined
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సర్వేలను, పార్టీ క్యాడర్‌ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
undefined
click me!