గన్నవరం రాజకీయాలు గరం గరం: యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ నాయకత్వం

First Published | Aug 16, 2023, 10:27 AM IST

పార్టీలో ఉండాలో వద్దో  తేల్చుకోవాల్సింది  యార్లగడ్డ వెంకటరావేనని  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.

yarlagadda venkat rao

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా  పోటీ చేసిన  యార్లగడ్డ వెంకటరావును వైసీపీ నాయకత్వం లైట్ గా తీసుకున్నట్టుగా కన్పిస్తుంది. మూడు  రోజుల క్రితం  గన్నవరంలోని ఓ ఫంక్షన్ హల్ లో యార్లగడ్డ వెంకటరావు  తన అనుచరులతో  సమావేశం ఏర్పాటు  చేశారు.  తనకు  వచ్చే ఎన్నికల్లో  టికెట్టు ఇవ్వాలని కోరారు.  ఈ విషయమై సీఎం జగన్ తో తాడోపేడో తేల్చుకొంటానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం చాలా లైట్ గా తీసుకున్నట్టుగా కన్పిస్తుంది.

sajjala

పార్టీలో ఉండాలో...  ఉండొద్దో తేల్చుకోవడం  యార్లగడ్డ వెంకటరావు ఇష్టమని  ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  పార్టీ అవసరాల రీత్యా ఎవరిని ఎలా ఉపయోగించాలో  జగన్ కు తెలుసునని  సజ్జల రామకృష్ణారెడ్డి   మీడియాకు  చెప్పారు.  అయితే  పార్టీ టిక్కెట్లు దక్కని వారికి   నామినేటేడ్ పదవులతో పాటు  ఇతర  పదవులను  కేటాయించే అవకాశం ఉందని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.  తమ పార్టీ పక్కన పెట్టిన వారిని టీడీపీ  తమ పార్టీలో చేర్చుకొని  వైసీపీ  పని అయిపోయిందనే  చెప్పుకొనే  ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శలు చేశారు. 

Latest Videos


2019  అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్థిగా  వల్లభనేని వంశీ,  వైఎస్ఆర్‌సీపీ  అభ్యర్థిగా  యార్లగడ్డ వెంకటరావు  పోటీ చేశారు.  యార్లగడ్డ వెంకటరావుపై   టీడీపీ అభ్యర్థి  వల్లభనేని వంశీ  విజయం సాధించారు.  ఆ తర్వాత  చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  వల్లభనేని వంశీ  టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో  చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకత్వం  వంశీకే  టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది.

yarlagadda venkat rao

యార్లగడ్డ వెంకటరావును  నియోజకవర్గ వ్యవహరాల్లో జోక్యం చేసుకోవద్దని  కూడ  పార్టీ నాయకత్వం సూచించింది.  అయితే  నియోజకవర్గంలో  పలు దఫాలు  యార్లగడ్డ వెంకటరావు,  వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య  ఘర్షణలు చోటు  చేసుకున్నాయి.  ఈ విషయమై పార్టీ నాయకత్వం కూడ  ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసింది.  అయితే  కొంతకాలంగా  యార్లగడ్డ వెంకటరావు   గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే  గత  మాసంలో  గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  వైఎస్ఆర్‌సీపీ  కీలక నేత  దుట్టా రామచంద్రారావుతో  యార్లగడ్డ వెంకటరావు  భేటీ కావడం రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత మీడియాతో  మాట్లాడిన  యార్లగడ్డ వెంకటరావు  కీలక వ్యాఖ్యలు చేశారు.  

dutta -yarlagadda

గన్నవరం రాజకీయాల్లో తాను  కీలకంగా వ్యవహరించనున్నట్టుగా ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తానని కూడ తేల్చి చెప్పారు. తాను వైఎస్ఆర్‌సీపీలోనే  ఉన్నానని కూడ ఆయన  ప్రకటించారు.ఈ  మీడియా సమావేశం తర్వాత  యార్లగడ్డ వెంకటరావు  మూడు రోజుల క్రితం  గన్నవరంలో  తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా  చూశాయి.  పార్టీకి విధేయుడిగా  ఉన్నానని చెబుతూనే  పార్టీ తీసుకున్న నిర్ణయాలను  యార్లగడ్డ వెంకటరావు  ప్రశ్నించారు. దుట్టా రామచంద్రరావుకు  ఎమ్మెల్సీ ఎందుకు  ఇవ్వలేదని ఆయన  ప్రశ్నించారు. అమెరికా నుండి తీసుకు వచ్చి నాలుగు రోడ్ల కూడలిలో జగన్ వదిలిపెట్టడని యార్లగడ్డ వెంకటరావు  ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఈ సమావేశం ఏర్పాటుపై యార్లగడ్డ వెంకటరావుపై  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం  అసంతృప్తితో ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాలతో  గన్నవరం రాజకీయాలు వేడేక్కాయి.  

పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్‌ నుంచి పార్టీ అభ్యర్థిగా గుండారపు పూజిత పేరును గతంలోనే ఖరారు చేశామని, ఆమెకు బీఫాం కూడా ఇచ్చామని, తాజాగా ఎంపీ కేశినేని నాని అదే డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ప్రకటించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని వెంకన్న, నాగుల్‌మీరా అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే  యార్లగడ్డ వెంకటరావు  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా  గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  బరిలోకి దిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా  ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారంపై యార్లగడ్డ వెంకటరావు  స్పష్టత ఇవ్వలేదు.  వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి  ఎన్ఆర్ఐ టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేస్తారని  మాజీ ఎమ్మెల్యే గన్నవరంలో నిర్వహించిన టీడీపీ సభలో గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

yarlagadda venkat rao


ఇదిలా ఉంటే  యార్లగడ్డ వెంకటరావు  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా  గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  బరిలోకి దిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా  ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారంపై యార్లగడ్డ వెంకటరావు  స్పష్టత ఇవ్వలేదు.  వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి  ఎన్ఆర్ఐ టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేస్తారని  మాజీ ఎమ్మెల్యే గన్నవరంలో నిర్వహించిన టీడీపీ సభలో గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

click me!