తిరుపతి ఎంపీ స్థానానికి వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) అభ్యర్ధిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తి ఈ స్థానం నుండి పోటీ చేస్తారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇదే విషయమై వైసీపీ కేంద్ర నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
undefined
మంగళవారంనాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్ధిగా నిర్ణయించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే ఈ ఎన్నికల్లో కూడ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
undefined
1985 జూన్ 22న గురుమూర్తి జన్మించారు. ఎస్సీ, మాల సామాజిక వర్గానికి చెందిన గురుమూర్తి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మన్నెసముద్రం గ్రామం గురుమూర్తిది. గురుమూర్తి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. గురుమూర్తి నవ్య కిరణ్ ను పెళ్లి చేసుకొన్నారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు.
undefined
2006 నుండి ఆయన వైఎస్ఆర్ కు గట్టి మద్దతుదారుడిగా ఉన్నాడు. స్విమ్స్ లో ఆయన చదువుకొనే రోజుల్లో వైఎస్ఆర్ ను ఆయన అభిమానించేవాడు. స్విమ్స్ లో ఫిజియోథెరపీ చదువుకొనే సమయంలో విద్యార్ధులకు నాయకుడిగా ఆయన వ్యవహరించేవాడు. ఈ సమయంలో ఆయన అప్పటి సీఎం వైఎస్ఆర్ ను కలుసుకొనే అవకాశం దక్కింది. వైఎస్ఆర్ కూడ గురుమూర్తికి సహాయం చేశాడు. దీంతో ఆయన వైఎస్ఆర్ ను అభిమానించేవాడు.
undefined
2014లో వైఎస్ జగన్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడ డాక్టర్ గురుమూర్తి పాల్గొన్నారు. అంతేకాదు 2017 నవంబర్ లో జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రలో కూడ పాల్గొన్నారు. జగన్ కు ఫిజియోథెరపిస్టుగా పనిచేశాడు. ప్రజా సమస్యల విషయంలో జగన్ ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయమై ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకొన్నట్టుగా డాక్టర్ గురుమూర్తి చెప్పారు.
undefined
వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత డాక్టర్ గురుమూర్తి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు.
undefined