బాబు ప్రచారం చేసినా నిరాశే: మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో గెలవని టీడీపీ

First Published Mar 14, 2021, 12:53 PM IST

ఏపీ రాష్ట్రంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కొన్ని చోట్ల ఖాతాలను తెరవలేదు. చాలా చోట్ల సింగిల్ డిజిట్లకే ఆ పార్టీ పరిమితమైంది.

మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచాచం చేసినా కూడ ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. అర్బన్ ప్రాంతాల్లో తమకు పట్టుందని భావించిన టీడీపీకి ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాత్రం మింగుడుపడడం లేదు. అన్ని చోట్ల వైసీపీ విజయ పథంలోకి దూసుకుపోతోంది.
undefined
గ్రామపంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్పిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు కూడ అదే రీతిలో వచ్చాయి.
undefined
ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం టీడీపీకి కలిసి రాలేదు.ఈ నెల 4న కర్నూల్, ఈ నెల 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరులో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
undefined
కర్నూల్, చిత్తూరు, గుంటూరు కార్పోరేషన్లలో వైసీపీ విజయం సాధించింది. విజయవాడ కార్పోరేషన్ పై టీడీపీ ఆశలు పెట్టుకొంది. కానీ ఈ స్థానంలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది.
undefined
టీడీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రం గెలుపొందింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత విజయం సాధించారు. గతంలో ఈ స్థానంలో టీడీపీ అధికారంలో ఉంది. విజయవాడలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు ప్రధానంగా ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపినట్టుగా ఆపార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
undefined
గుంటూరు, విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలపై టీడీపీ ప్రధానంగా కేంద్రీకరించింది. రాజధాని అంశాన్ని చంద్రబాబునాయుడు కేంద్రీకరించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే మూడు రాజధానులకు మద్దతిచ్చినట్టేనని చంద్రబాబునాయుడు ప్రకటించారు.
undefined
అంతేకాదు అమరావతి కోసం నేనొక్కడినే పోరాటం చేయాలా.. మీరు ఇంట్లో పడుకొంటారా అని ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడ టీడీపీకి ఈ ఎన్నికల్లో ప్రయోజనం దక్కలేదు.
undefined
తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ నెల 1వ తేదీన చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్టులోనే సుమారు 7 గంటలకు పైగా నిరసనకు దిగారు. ఈ నిరసన కూడ టీడీపీకి కలిసి రాలేదు.చిత్తూరు జిల్లాతో పాటు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో వైసీపీ విజయఢంకా మోగించింది.
undefined
ఇక విశాఖపట్టణం మున్సిపల్ ఎన్నికల్లో కూడ వైసీపీ అభ్యర్ధులు అధిక స్థానాల్లో విజయం సాధించినట్టుగా సమాచారం అందుతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతోందని భావించారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమం సాగుతోంది. ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో లెఫ్ల్ పార్టీలు రెండు స్థానాలను కైవసం చేసుకొంది.
undefined
click me!