ఎన్డీఎలో వైసీపీ చేరిక: అదంతా వైఎస్ జగన్ మైండ్ గేమ్?

First Published Oct 8, 2020, 8:18 AM IST

అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. 

ఎన్డీలో చేరాల్సిందిగా వైసీపీని బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో వైఎస్ జగన్ భేటీలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా ఎన్డీఎలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
undefined
అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు వైసీపీ ఎంపీలకు స్థానం కల్పిస్తామని బిజెపి పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. విజయసాయి రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు చెప్పారు.
undefined
అదే సమయంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని కూడా ప్రచారం జరిగింది. బిజెపికి చెందిన సోము వీర్రాజుకు, ఎమ్మెల్సీ మాధవ్ కు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇమేజ్ పెంచుకునేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు
undefined
ఎన్డీఎలోకి బిజెపిని అహ్వానించినట్లు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. అదంతా ఉత్త ప్రచారమేనని బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.
undefined
అయితే, ఇటీవలి కాలంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై దూకుడును తగ్గించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆందోళనకు కూడా దిగారు. దాంతో బిజెపి శ్రేణులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున కదిలాయి. అయితే, అకస్మాత్తుగా సోము వీర్రాజు వెనక్కి తగ్గడం వెనక కారణాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
undefined
వైఎస్ జగన్ కేంద్రం పెద్దలతో సయోధ్యనే కోరుకుంటున్నారు. అంశాలవారీగా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. బహుశా, కేంద్రంలోని పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పట్ల మెతక వైఖరిని తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందువల్లనే సోము వీర్రాజు దూకుడు తగ్గించారనే మాట వినిపిస్తోంది.
undefined
బిజెపికి రాష్ట్రంలో అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రం పెద్దలు తనతో సఖ్యంగా ఉన్నారనే సంకేతాలను ఇవ్వడం వల్ల రాష్ట్రంలో బిజెపి దూకుడికి అడ్డుకట్ట వేయవచ్చునని ఆయన భావించారని చెబుతున్నారు. ఏమైనప్పటికీ జగన్ తన ప్రయత్నంలో ఫలితం సాధించినట్లే కనిపిస్తున్నారు.
undefined
click me!