స్థానిక ఎంపీతో విడదల రజిని ఫైట్: జగన్ చెంతకు పంచాయితీ

First Published Jul 7, 2020, 4:57 PM IST

2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకు టీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లో గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నేతలు మనకు చాలామంది కనబడుతారు. అధికార పక్షంలో మంత్రులు పాముల పుష్పశ్రీవాణి, వనిత సుచరిత వంటి వారు ఉన్నప్పటికీ... రోజా, విడదల రజని బాగా పాపులర్. కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వీరికి ఫాలోయింగ్ బాగా ఉంది. మంత్రి పదవులు అంటే వీరి పేర్లు చర్చకు రాకుండా ఆ చర్చ ముగియదు.
undefined
రోజా ఒకింత సీనియర్. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాన్ని బాగానే కార్నర్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె సెలబ్రిటీ. ఇవన్నీ వెరసి రోజాకు ఫాలోయింగ్ ఉండడం తథ్యం. కానీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన విడదల రజినికి ఇంత ఫాలోయింగ్ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం.
undefined
2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాగెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకుటీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లోగెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు.
undefined
అప్పటివరకు వైసీపీ నుంచి టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్ కి టికెట్ దక్కలేదు. ప్రత్తిపాటి పుల్లారావు వంటి నేతను ఢీకొనాలంటే... అంగబలం తోపాటుగా అర్ధబలంక అవసరమని భావించిన పార్టీ చివరి నిమిషంలో టికెట్ ను విడదల రజినీకి ఇచ్చింది. జగన్ వేవ్ లో ఆమె గెలిచేసింది. గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది.
undefined
ఇక ఆమె ఎమ్మెల్యే అయినప్పటినుండి ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆమె స్థానం సుస్థిరం చేసుకోవాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి ప్రజల్లో పాపులారీటీపెంచుకోవాలి, రెండు తన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదగనీయకుండా చూడాలి. రజని ఈ రెండు విషయాలను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
undefined
ఆమె తన పిఆర్ టీం ను రంగంలోకి దింపి సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించారు. అంతే కాకుండా చిలకలూరిపేటలో ఈ కరోనా కష్టకాలంలో ప్రజలతో బాగానే మమేకమయ్యారు. వైసీపీ పార్టీ అన్ని కార్యక్రమాలను దెగ్గరుండీ చూసుకుంటూ... ఆమె ముందుకుసాగుతున్నారు.
undefined
ఇక రెండవది ఆమె రాజకీయంగా ఎవ్వరిని ఎదగనీయకుండా తాను మాత్రమే అక్కడ ఏకైక లీడర్ అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేయడం అటుంచితే ఆమె సొంత పార్టీలోని మరో నేతను కూడా సైలెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
undefined
వైసీపీ నుంచి వాస్తవానికి 2019 అసెంబ్లీ అభ్యర్థిగా తొలి నుంచి మర్రి రాజశేఖర్ ని అనుకున్నారు. కానీ ఆర్ధిక బలం అనే అర్హతతో విడదల రజినీ టికెట్ ఎగరేసుకుపోయింది. జగన్ సునామీలో ఆమె సైతం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. అయితే మర్రి రాజశేఖర్ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి చిలకలూరిపేటలో తనదైన వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు.
undefined
ఆయన ఆది నుంచి జగన్ వెంటే ఉన్నారు. జగన్ తోపాటుగా నడిచారు. ఆయనకువైసీపీ అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ అధిష్టానం నుంచి సమాచారం కూడా ముందుగా ఈయనకే అందుతుందట. అధిష్టానంతో ఏమైనా పనులు కావాలన్న కూడా ప్రజలను మర్రి రాజశేఖర్ అధిష్టానం వద్దకు తీసుకువెళుతున్నాడట.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన విడదల రజిని ఆయనకు చెక్ పెట్టేందుకు అన్ని వ్యూహాలు పన్నుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎంపీ లావు శ్రీకృష్ణ చిలకలూరిపేటలో విడదల రజిని వర్గీయులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా కొన్ని రోజుల కింద ఆయన చిలకలూరిపేటలోకి రాకూడదు అంటూ ఆయన వాహనానికి అడ్డంపడి వాహనం పై దాడి చేసిన విషయంవిదితమే.
undefined
దీనికి కారణం మర్రి రాజశేఖర్ అంశం. మర్రి రాజశేఖర్ కి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నేరుగా మర్రి బర్త్ డే కు వస్తుండడంతో... రజిని వర్గీయులు ఆయనపై దాడి చేసారు. మర్రి రాజశేఖర్ విషయం అంటేనే విడదల రజిని ఒంటికాలిపై లేస్తున్నారట. ఆయన పుట్టినరోజు సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలను సైతం మునిసిపల్ సిబ్బందితో చెప్పి తొలిగింపజేసింది రజిని అని అంటున్నారు మర్రి వర్గీయులు.
undefined
ఈ గొడవ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందట. రజిని సేవ కార్యక్రమాలతో ప్రజల్లో తన ఇమేజ్ ని కూడా ఇదే సమయంలో పెంచుకుంటూ పోతుండడంతో.... ఆమె పాపులారిటీ బాగానే సంపాదిస్తున్నారు. పెర్ఫార్మన్స్ విషయంలో రజిని మంచి మార్కులనే కొట్టేస్తుందట. కాబట్టి అధిష్టానం కూడా ఈ వర్గపోరుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మర్రికి సైతం ఒక పదవిని ఇవ్వాలని భావిస్తున్నారట. మండలి సీటును ఇప్పుడు మర్రికి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా సమాచారం.
undefined
click me!