తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

First Published | Jul 21, 2020, 3:29 PM IST

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది. 

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది.
undefined
తిరుపతికి నేరుగా చేరుకొన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇక్కడే టిక్కెట్లు తీసుకొనే వెసులుబాటును కల్పించింది టీటీడీ. అయితే శ్రీవారి సర్వదర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్ తిరుపతిలో ఉంది. ఈ కౌంటర్ ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ ‌లో ఉంది. దీంతో సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది.
undefined

Latest Videos


ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి రోజూ 12 వేల మంది భక్తులకు వెంకన్నను దర్శించుకొనే అవకాశం కల్పించింది. టీటీడీ. గత నెలలో కేవలం 9 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది.
undefined
ఆన్ లైన్ లో 9 వేల టిక్కెట్లు, సర్వదర్శనం టిక్కెట్లు (ఆఫ్ లైన్ )లో 3 వేల టిక్కెట్లు జారీ చేసేవారు.తిరుపతితో పాటు, తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతుండడం టీటీడీకి ఆందోళన కల్గిస్తోంది.
undefined
చిత్తూరు జిల్లాలో నమోదౌతున్న కేసుల్లో 40 శాతం కేసులు తిరుపతిలోనే ఉంటున్నాయి. తిరుపతి పట్టణంలో 48 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.టీటీడీలో పనిచేసే 170 మందికి కరోనా సోకింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు కూడ కరోనాతో మరణించాడు.
undefined
జూలై 21 నుండి ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 11 గంటల తర్వాత రోడ్లపై జనం తిరగవద్దని జిల్లా యంత్రాంగం కోరింది.అయితే తిరుమలలో వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఈ నిబంధనలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోలేదు.
undefined
తిరుపతిలో కరోనా కేసులు పెరిగిపోవడం, టీటీడీ సిబ్బందికి కూడ కరోనా బారినపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. కరోనా కేసులు పెరిగినా కూడ భక్తులకు దర్శనాలు కల్పిస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం టీటీడీ ఎదురు చేస్తున్నట్టుగా సమాచారం
undefined
తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల సీఎం జగన్ ను కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు.
undefined
click me!