ఎపిలో సీన్ రివర్స్: బిజెపికి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం

First Published Jul 30, 2019, 6:46 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.
undefined
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.
undefined
తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.
undefined
ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.
undefined
బిజెపి రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.
undefined
అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారు.
undefined
మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించే వ్యూహం మారలేదు గానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.
undefined
click me!