దేవినేని ఉమా, కొడాలి నాని మధ్య చిచ్చు: పాత గాయాన్ని కెలికిన కేశినేని

First Published Jun 11, 2019, 11:57 AM IST

విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, టీడీపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావును లక్ష్యం చేసుకుంటూ ఆయన ఆ పోస్టు పెట్టారు. 

విజయవాడ: విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు పార్టీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి, టీడీపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావును లక్ష్యం చేసుకుంటూ ఆయన ఆ పోస్టు పెట్టారు. అయితే, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని పేరును కూడా అందులో ఆయన ప్రస్తావించారు.
undefined
తనను మంత్రిని చేసిన దేవినేని ఉమాకు జీవితాంతం కొడాలి నాని కృతజ్ఞుడిగా ఉండాలని కేశినేని నాని పోస్టు పెట్టారు. అయితే, కొడాలి నానిని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టినట్లు కనిపిస్తున్నా అది దేవినేని ఉమా తీరుపై వ్యంగ్యాస్త్రం విసరడమేనని అంటున్నారు.
undefined
దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని నానిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. దేవినేని ఉమా మహేశ్వర రావు తీరు వల్లనే కొడాలి నాని పార్టీని వీడారని, పార్టీని వీడడం వల్ల ఆయన మంత్రి అయ్యారని కేశినేని నాని చెప్పకనే చెప్పారని అంటున్నారు. పదేళ్ల కిందట జిల్లాలో దేవినేని ఉమా, కొడాలి నానిల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి.
undefined
ఆ తర్వాత టీడీపి నేత వల్లభనేని వంశీ, దేవినేని ఉమాల మధ్య కూడా విభేధాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. పరస్పరం రాజీనామాలు సమర్పించడం దాకా ఆ వివాదం వెళ్లింది. ఈ స్థితిలోనే కొడాలి నాని పార్టీ నుంచి వెళ్లిపోవడానికి దేవినేని ఉమానే కారణమని పార్టీలో అప్పట్లో ప్రచారం జరిగింది.
undefined
కాగా, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను చూస్తున్న వల్లభనేని వంశీని తప్పించి ఆయన స్థానంలో కేశినేని శ్రీనివాస్ ను నియమించారు. కేశినేని శ్రీనివాస్‌ ను తెరమీదకు తీసుకు వచ్చింది దేవినేని ఉమా అనే విషయం అందరికీ తెలిసిందే. ఉమా తీరు వల్ల కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే వంశీ మాత్రం సర్దుకుపోయారు.
undefined
click me!