ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవెటీకరణ చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న సమయంలో, కార్మికులు ఆందోళన చేస్తున్న తరుణంలో ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆ ప్రకటన చేశారు

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని, ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని ఆపుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన హామీ నెరవేరుతుందా అనేది అనుమానమే. ప్రైవేటీకరణ జరగకుండా ఆయన ఏం చేస్తారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సాధారణంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపించడమూ, చిత్తశుద్ధితో ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపించకోవడం జగన్ చేస్తున్నారని అందరూ అనుకోవడంలో తప్పేమీ లేదు. సాధారణంగా తమ చేతుల్లో లేనివాటి గురించి ఏ అధినేత అయినా అదే వ్యూహంతో పనిచేస్తారు. ఒకవేళ జగన్ ప్రైవేటీకరణను అపితే అది ఒక మహాద్భుతమే

ఇదిలావుంటే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటీకరణ ప్రతిపాదనను విశాఖపట్నం శారదా పీఠాధిపతి కూడా వ్యతిరేకించారు. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేయాలని ఆయన అన్నారు. స్వరూపానందేంద్ర స్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. అదే సమయంలో బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి జగన్ ను కలిశారు. ఆయన కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. దీన్ని బట్టి చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై కాకుండా వైఎస్ జగన్ ను తప్పు పడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. అందువల్ల చంద్రబాబు జగన్ ను మాత్రమే తప్పు పట్టడంలో అర్థంలేదని అనిపిస్తోంది. కేంద్రంపై గానీ ప్రధాని నరేంద్ర మోడీపై గానీ ఆయన విమర్శలు చేయకపోవడం కాస్తా వింతగానే అనిపిస్తుంది. అయితే, భవిష్యత్తు రాజకీయావసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అలా వ్యవహరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

ఇకపోతే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ది కక్కలేని మింగలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆయన తలొగ్గక తప్పని పరిస్థితి, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమోద ముద్ర పడేలా చూసే బాధ్యత కూడా ఆయన మీదనే పడినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే, ఆయన రాజకీయ భివిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ప్రజల గొంతుకకు గొంతు కలిపే పరిస్థితి లేదు. అలా లేని చోట అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి విశాఖ ఉక్కు కర్మాగారంపై స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. గతంలో గోడలపై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గోడలపై నినాదాలు రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉక్కు కర్మాగారంపై చిరంజీవి స్పందనను పరిశీలిస్తే ఆయన రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. గతంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటన గుర్తుకు రాక మానదు. చిరంజీవి జనసేనకు మద్దతు ఇస్తారని, జనసేనకు సాయం చేస్తారని ఆయన చెప్పారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే మాట చెప్పారు. దీన్నిబట్టి సమయం చూసి చిరంజీవి రంగంలోకి దూకుతారా అని అనిపించకమానదు