ఎన్నికల వేళ బిసి మంత్రం... టిడిపి-జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణ ఇదేనా?

Published : Sep 29, 2023, 10:24 AM ISTUpdated : Sep 29, 2023, 10:53 AM IST

తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా రాజకీయ పార్టీలన్ని బిసి మంత్రాన్ని జపిస్తున్నారు. రాజకీయంగా ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ప్రధాన పార్టీలన్నీ వున్నాయి. 

PREV
17
ఎన్నికల వేళ బిసి మంత్రం... టిడిపి-జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణ ఇదేనా?
AP Politics

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, కాపు సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో రెడ్డిల ప్రభావం వుంటుంది. కానీ జనాభాపరంగా ఎక్కువగా వున్న బిసిలకు రాజకీయ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. బిసిలు కేవలం సామాజికంగానే కాదు రాజకీయంగానూ బ్యాక్ వర్డ్ లోనే వున్నారు. వీరిని ఓటుబ్యాంకుగా మాత్రమే చూసే రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బిసి మంత్రాన్ని జపిస్తున్నారు. ఇరు తెలుగురాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు బిసిలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి ల మాదిరిగానే ఏపీలో టిడిపి, జనసేన కూటమి కూడా బిసి నాయకులకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలనే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 
 

27
tdp

అధినేత చంద్రబాబు అరెస్ట్, కొనసాగుతున్న కోర్టు విచారణలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందకు టిడిపి రాజకీయ కార్యాచరణ కమిటి (పిఏసి) మరోసారి సమావేశం కానుంది. రేపు(శనివారం) చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే సమావేశమవ్వాలని టిడిపి నిర్ణయించింది. ప్రస్తుతం డిల్లీలో వున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో జూమ్ ద్వారా పాల్గొననున్నారు. 

37
TDP

ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు ఖరారయి ప్రకటన కూడా వెలువడిన నేపథ్యంలో ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచణపై ఈ పీఏసి మీటింగ్ లో చర్చించనున్నట్లు సమాచారం. టిడిపికి ఎలాగూ కమ్మ సామాజికవర్గం మద్దతు వుంది కాబట్టి జనసేనతో పొత్తుద్వారా కాపు, బిసి సామాజికవర్గాలకు దగ్గరవ్వాలని టిడిపి భావిస్తోంది. దీనిపై పీఏసి మీటింగ్ లో మరింత లోతుగా చర్చించి కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. 

47
tdp janasena

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి సామాజికవర్గాలదే రాజకీయ ఆధిపత్యం. రాజకీయ అవకాశాల్లో, పదవుల్లో బిసిలకు పెద్దగా ప్రాధాన్యత వుండదు... కానీ పార్టీల గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో బిసి ఓటర్లు వున్నారు. ఇటీవల కాలంలో బిసిల్లోనూ రాజకీయ చైతన్యం పెరిగిపోయింది. దీంతో వారిని తమవైపు తిప్పుకోవాలని ప్రతిపక్ష టిడపి, జనసేన కూటమి భావిస్తున్నాయి. 

57
TDP Janasena

టిడిపి, జనసేన కలిసాయి కాబట్టి పలు జిల్లాల్లో కాపు, బిసి సామాజికవర్గాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వుంది. క్షేత్రస్థాయిలో ఈ రెండు సామాజికవర్గాలను కలుపుకుపోయేలా టిడిపి శ్రేణులను సిద్దం చేయాల్సి వుంది. కమ్మ, కాపు, బిసి సామాజికవర్గాలను ఒక్కతాటిపై తీసుకువస్తే విజయం తమదేనన్న ధీమాతో టిడిపి, జనసేన పార్టీలు వున్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిసి నాయకులకు అధిక సీట్లు కేటాయించడానికి టిడిపి, జనసేన కూటమి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. 

67
TDP Janasena

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి, జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా వుండనుంది. అక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా వుండనుంది. దీంతో ఆ జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇవాళ జరిగే టిడిపి పిఏసి మీటింగ్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

77
TDP

ఇక స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు మరిన్ని కేసులు పెట్టి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చూస్తోంది వైసిపి ప్రభుత్వం. వీలైనంత ఎక్కువకాలం చంద్రబాబును జైల్లోనే వుంచాలన్నది అధికార పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మద్దతుగా మరికొన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని టిడిపి ఆలోచిస్తోంది. వీటిపైనా రేపటి పీఏసి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories