వైఎస్సార్, పవన్ సేమ్ టు సేమ్ :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ గా కెరీర్ ఫీక్ స్టేజ్ లో వుండగానే రాజకీయాల్లో ప్రవేశించారు. పవన్ కల్యాణ్ కూడా ఇలాగే సినిమాల్లో టాప్ ప్లేస్ లో వుండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యేగా మారారు.
ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. తండ్రి రాజారెడ్డి ప్రోద్భలంతో వైఎస్సార్, అన్న చిరంజీవి ప్రొద్భలంతో పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేసారు. ఇద్దరూ రాజకీయాల్లో అత్యున్నత పదవులు అధిరోహించారు.