గంగుల ఫ్యామిలీ టార్గెట్: భూమా అఖిలప్రియ సోదరులు అందుకే...

First Published Jul 26, 2019, 1:33 PM IST

ఆళ్లగడ్డలో బీజేపీ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. భూమా కుటుంబాన్ని తమ వైపుకు లాక్కొంది. భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. అఖిలప్రియ ఏ వైపు అడుగులు వేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరులు కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత భూమా అఖిలప్రియకు బీజేపీలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ, ఆమె ఆ పార్టీలో చేరలేదు.
undefined
వైఎస్ఆర్‌సీపీలో చేరాలని ప్రయత్నించినట్టుగా ప్రచారం సాగింది. అయితే వైఎస్ఆర్‌సీపీలో తలుపులు మూసుకుపోయినట్టుగా చెబుతున్నారు. దీంతో ఆమె స్థబ్దుగా ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కొందరు భూమా సోదరులకు గాలం వేశారు. భూమా మహేష్ రెడ్డి, కిషోర్ రెడ్డిలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు.
undefined
గంగుల వర్గాన్ని ఢీకొట్టాలంటే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని భూమా మహేష్ ,కిషోర్ రెడ్డిలు చెబుతున్నారు.భూమా వర్గాన్ని నడిపించడంలో భూమా అఖిలప్రియ విఫలమయ్యారని కిషోర్ రెడ్డి అభిప్రాయంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారని చెబుతున్నారు.
undefined
బీజేపీలో చేరే ముందు భూమా కిషోర్ రెడ్డి భూమా అనుచరులతో పాటు బంధువులతో చర్చించినట్టుగా సమాచారం. మరో వైపు భూమా అఖిలప్రియ భర్త తీరును కూడ భూమా వర్గీయులు తప్పుబడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
భూమా వర్గీయులను ఏకతాటికి మీదికి తీసుకురావడంలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఖిలప్రియకు ఏపీ సుబ్బారెడ్డికి మధ్య అగాధం పెరిగిన విషయం తెలిసిందే.
undefined
ఏవీ సుబ్బారెడ్డి కూడ టీడీపీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అందుకే భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరడం వెనుక ఏవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి బీజేపీలో చేరుతారా... సోదరితో కలిసి టీడీపీలోనే ఉంటారా అనే విషయమై కూడ రకరకాలుగా ప్రచారాలు ఉన్నాయి.
undefined
భూమా వర్గమంతా బీజేపీలో చేరుతోందనే ప్రచారం సాగుతున్నా బ్రహ్మనందరెడ్డి ఖండించడం లేదు. గత ఎన్నికల్లో అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. తనకు టీడీపీలో సభ్యత్వం కూడ లేదని కిషోర్ రెడ్డి గుర్తు చేశారు.
undefined
2024లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగుర వేస్తామని ఆయన ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశించి తాము బీజేపీలో చేరలేదని కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ, బ్రహ్మనందరెడ్డి ల కోసం పనిచేసిన కిషోర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులపైనే బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారా అనే చర్చ కూడ సాగుతోంది.
undefined
గంగుల కుటుంబాన్ని ఎదుర్కొనే క్రమంలో భూమా కుటుంబసభ్యుల మధ్యే పోటీ జరిగితే ప్రత్యర్థులకే లాభం జరుగుతుందని వాదించే వారు కూడ లేకపోలేదు. అయితే భూమా ఫ్యామిలీని ఏకతాటిపై నడిపే విషయంలో అఖిలప్రియ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
undefined
click me!