పయ్యావులకు పదవి:చంద్రబాబుపై సీనియర్ల అసంతృప్తి

First Published Jul 26, 2019, 12:24 PM IST

చంద్రబాబు నాయుడు తీసుకొన్న నిర్ణయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న పదవి విషయంలో పార్టీ చీఫ్ నిర్ణయం ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది.

పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.
undefined
ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ పదవులకే టీడీపీ పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలపై బీజేపీ కన్నేసింది.
undefined
పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీలకు వలసలను నివారించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు.ఏపీ అసెంబ్లీలో విపక్షంగా ఉన్న టీడీపీకి పీఏసీ ఛైర్మెన్ పదవి దక్కనుంది. ఈ పదవికి పేర్లను ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును కోరారు.
undefined
పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్‌ పేరును చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ మేరకు స్పీకర్‌కు కూడ ఆయన లేఖ పంపినట్టుగా సమాచారం.పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం పయ్యావుల కేశవ్ తో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్‌లు పోటీ పడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్‌కు ఈ పదవిని దాదాపుగా కేటాయించినట్టుగా తొలుత ప్రచారం సాగింది.
undefined
అయితే చివరకు చంద్రబాబు పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు చూపారు. ఇటీవల తానా సభల్లో పాల్గొనేందుకు పయ్యావుల కేశవ్ అమెరికా వెళ్లారు. అమెరికాలో పయ్యావుల కేశవ్ తో బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ సమావేశమయ్యారు. బీజేపీలోకి పయ్యావుల కేశవ్ చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగింది.
undefined
అయితే ఈ ప్రచారాన్ని కేశవ్ ఖండించారు. కేశవ్ కు అసెంబ్లీ వ్యవహరాలపై పట్టు ఉన్న కారణంగానే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారని పార్టీలో ఓ వర్గం వాదిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికే ఉన్న ఒక్క కేబినెట్ ర్యాంకు పోస్టును కేటాయించడంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
undefined
అధికార వైసీపీ బీసీ, కాపు సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మరో వైపు బీజేపీ నుండి టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు. ఈ తరుణంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేశవ్ కే పీఏసీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టడం సరికాదని వాదించే వారు కూడ లేకపోలేదు.
undefined
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.
undefined
మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ ను ఈ పదవి కోసం ఎంపిక చేసినట్టుగా ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు చివరి నిమిషంలో పయ్యావుల కేశవ్ వైపే బాబు మొగ్గు చూపారు.
undefined
కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ పదవిని కేటాయిస్తే పార్టీలో ఇతర ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యేవారు కాదనే అభిప్రాయం కూడ లేకపోలేదు.ఈ పదవిపై పెట్టుకొన్న ఆశలు గల్లంతు కావడంతో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారనే ప్రచారం సాగుతోంది.
undefined
click me!