ఆదర్శం: 300 ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం, మాంసం బంద్

First Published Oct 11, 2020, 11:10 AM IST

మద్యానికి, మాంసానికి అనంతపురం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఒకటి కాాదు రెండు కాదు 300 ఏళ్ల నుండి ఈ గ్రామస్తులు ఈ రెండింటిని ముట్టరు. ఇప్పటికీ ఈ గ్రామంలో ఇదే ఆచారం కొనసాగుతోంది.

తమ పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా మద్యం, చికెన్ కుదూరంగా ఉంటున్నారు ఆ గ్రామస్తులు. 300 ఏళ్ల నుండి ఈ రెండింటికి ఆ గ్రామస్తులు దూరమయ్యారు. ఈ రోజుల్లో కూడ మద్యం, చికెన్ కు దూరంగా ఉంటున్నారు అనంతపురం జిల్లాలోని అడిగుప్ప గ్రామస్తులు.
undefined
రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. గుమ్మఘట్ట మండలం పరిధిలోకి ఈ గ్రామం వస్తోంది. ఈ గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 600.
undefined
ఈ గ్రామంలో నివసించే వారంతా బోయ సామాజిక వర్గానికి చెందినవారే. ఈ గ్రామంలో 300 ఏళ్లుగా మద్యయనిషేధం అమల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.మద్యంతో పాటు కోడిగుడ్డు, కోడి మాంసం కూడ గ్రామస్తులు తినరు. తరతరాలుగా ఈ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
undefined
300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.
undefined
చిత్రదుర్గ రాజుపై విజయం సాధించాడు. తన రాజ్యంలో సంపదను దోచుకొనేందుకు ప్రజలకు మద్యం, మాంసం అలవాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తించాడు.మద్యం, చికెన్ తినకూడదని రాజు ఆదేశించాడు.
undefined
ప్రజలతో కూడ ఈ విషయమై ప్రమాణం చేయించాడు. అప్పటి నుండి ఈ గ్రామంలో అదే నిబంధన కొనసాగుతోంది.గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు వస్తే గ్రామ పెద్దలు పరిష్కరిస్తారు.
undefined
click me!