అప్పట్లో చింతమనేని, ఇప్పుడు కోటంరెడ్డి: రోజాకు ఎమ్మెల్యే వివాదం సెగ

First Published Oct 5, 2019, 3:36 PM IST

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఆమెపై చింతమనేని దాడి చేశారన్న వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో చింతమనేని ఇప్పుడు వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 
 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోవివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాల్లో ఇరుక్కుంటున్న ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారనే చెప్పుకోవాలి.
undefined
ఇటీవల కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్ట్ ను ఫోన్ లో బెదిరించిన వార్తలు అప్పట్లో పెద్ద హల్ చల్ చేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించి పెద్ద ఎత్తున దుమారం లేపారు.
undefined
సుమారు రెండు రోజులపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశంపైనే ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిందంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓ మహిళా వైద్యురాలుని కూడా దూషించారంటూ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.
undefined
తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఏకంగా ఓ ప్రభుత్వ అధికారి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి తనపై దౌర్జన్యానికి దిగారంటూ వెంకటాచలం ఎంపీడీవో సరళ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
undefined
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు లే అవుట్‌కు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో కోటంరెడ్డి తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కల్లూరిపల్లిలోని తన ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఎంపీడీవో సరళ ఆరోపించారు.
undefined
లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వనందుకే దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ఇంటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడమే కాకుండా, నీటి పైపులైనును కూడా ధ్వంసం చేశారని, కేబుల్ వైర్లను సైతం ముక్కలు ముక్కలు చేశారని ఆరోపించారు.
undefined
కోటంరెడ్డి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే స్టేషన్‌లో ఉన్నది ఒక్క కానిస్టేబులేనని తెలియడంతో ఆమె బయటే బైఠాయించారు. సీఐ లేదా ఎస్సై వచ్చేదాకా ఆమె అక్కడే బైఠాయించారు. సరళకు గ్రామకార్యదర్శుల సంఘీభావం తెలిపారు. అనంతరం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు.
undefined
ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం చేశారన్న వార్తలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తారా అంటూ మండిపడ్డారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
undefined
న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళా అధికారులని కూడా చూడకుండా ఇంటికి వెళ్లి దౌర్జన్యాలు చేస్తారా అని నిలదీశారు.
undefined
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉండి ఉంటే సీఎంకు ఇవేమీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జర్నలిస్టును చంపుతానని ఫోన్లో బెదిరించాడని, మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని చంద్రబాబు నిలదీశారు.
undefined
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ పాలన రాక్షస పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు.
undefined
మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థం కావట్లేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ ప్రశ్నించారు. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమన్నారు.
undefined
అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బతకలేని పరిస్థితి తీసుకువచ్చారని ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటే ఆందోళన కలుగుతుందన్నారు.
undefined
మరోవైపు మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అక్రమాలకు సహకరించకుంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఓ గెజిటెడ్ అధికారికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
undefined
ఆపదలో ఉన్న ఆ మహిళా అధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే స్పందన కరువైందని ఆరోపించారు. కోటంరెడ్డి దారుణాలపై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.
undefined
వైసీపీ ఎమ్మెల్యే అరాచకంతో మహిళా ఎంపీడీఓ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. భూ సర్వే టెండర్లలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జాన్యాలపై చర్యలు తీసుకోకపోతే తాము పోరాటం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు.
undefined
ఎంపీడీవో సరళపై దాడిని తెలుగుదేశం పార్టీ బూచిగా చూపించి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నిలదీస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా ఇప్పుడు మహిళా అధికారి ఇంటిపై సొంత పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తోంది.
undefined
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అప్పట్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహాశీల్దార్ వజాక్షిపై దాడికి దిగారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఆమెపై చింతమనేని దాడి చేశారన్న వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో చింతమనేని ఇప్పుడు వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
undefined
ఇదిలా ఉంటే ఎంపీడీవో సరళ ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లలేదని బెదిరించలేదని చెప్పుకొచ్చారు. ఎంపీడీవోకు మూడు రోజుల క్రితం ఫోన్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
undefined
తన సన్నిహితుడు లే అవుట్ వేస్తే అందుకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. లే అవుట్ కు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఇవ్వొద్దన్నారంటూ ఆమె అనుమతులు ఇవ్వడం లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తాను ఎవరిపైనా దాడికి దిగలేదన్నారు.
undefined
click me!