ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజా.. జీతం ఎంత అందుకుంటున్నారంటే...

First Published Oct 5, 2019, 10:19 AM IST

కుల సమీకరణాల కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేని జగన్ ఆమెకు నచ్చచెప్పారు. కీలకపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే.. తాజాగా రోజాని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకి సీఎం వైఎస్ జగన్ ఏఐసీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పదవి కింద ఆమెకు జీతం ఎంత ఇస్తున్నారనే విషయాన్ని ఇటీవల ప్రభుత్వం తెలియజేసింది.
undefined
జీతభత్యాల కింద నెలకు రూ.3.82లక్షలను కేటాయిస్తూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలొ రూ.2లక్షలు ఆమెకు జీతం కింద కేటాయించారు. వాహన సౌకర్యం కోసం నెలకు రూ.60వేలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
undefined
అంతేకాకుండా అధికారిక క్వాటర్ట్స్ లో నివాసం లేదు కాబట్టి అదనంగా వసతి సౌకర్యానికి రూ.50వేలు కేటాయించారు. ఇక ఆమె మొబైల్ ఫోన్ ఛార్జీలకు నెలకు రూ.2వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు రూ.70వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
undefined
ఇదిలా ఉండగా... వైసీపీ అధికారంలోకి వస్తే... రోజాకి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే... నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చినా.. రోజాకి మాత్రం మంత్రి పదవి కేటాయించాలేదు. ఈ విషయంలో రోజా బాగా హర్ట్ అయ్యారని కూడా వార్తలు వెలువడ్డాయి.
undefined
అయితే... కేవలం కుల సమీకరణాల కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేని జగన్ ఆమెకు నచ్చచెప్పారు. కీలకపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే.. తాజాగా రోజాని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
undefined
అదే సమయంలో.. తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) స్పెషల్‌ ఆఫీసర్‌గా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్ కు చెందిన ధర్మారెడ్డి టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ధర్మారెడ్డి బుధవారం వరకు కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు
undefined
click me!