Chandrababu Naidu : రెండెకరాల సామాన్య రైతు కొడుకు ... దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా అయ్యారు!!

Published : Dec 31, 2024, 04:55 PM ISTUpdated : Dec 31, 2024, 05:08 PM IST

చంద్రబాబు నాయుడు ... కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఈ పేరు పెను సంచలనం. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకుడు. తాాజాగా దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా ఆయన నిలిచారు. మరి సాధారణ రైతు బిడ్డ నుండి సీఎంగా ఇప్పుడు రిచ్చెస్ట్ సీఎంగా ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. 

PREV
14
Chandrababu Naidu : రెండెకరాల సామాన్య రైతు కొడుకు ... దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా అయ్యారు!!
Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu : భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తులే ఎక్కువని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) ప్రకటించింది. చంద్రబాబు కుటుంబం ఆస్తులు ఏకంగా రూ.931 కోట్లుగా వున్నాయి. ఇలా దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో సంపన్న సీఎంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు. 

ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తిపాస్తుల వివరాల ఆధారంగా ఏ రాష్ట్ర సీఎం ఎంత సంపన్నుడో ప్రకటించింది ఏడిఆర్. ఇందులో చంద్రబాబు పేరిట కేవలం రూ.36 కోట్ల ఆస్తులే వున్నాయి... కానీ ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్లు వున్నాయి. మొత్తంగా చంద్రబాబు దంపతుల ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా తేలింది. చంద్రబాబుకు రూ.10 కోట్ల వరకు అప్పుకూడా వున్నట్లు ఏడిఆర్ పేర్కొంది. 

కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి పేరిట వున్న ఆస్తిపాస్తులే లెక్కేసింది ఏడిఆర్. ఆయన తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ల పేరిట వున్న ఆస్తులను లెక్కలోకి తీసుకోలేదు. వీటిని కూడా కలిపితే చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు రూ.1000 కోట్లు దాటుతుంది. 
 

24
Nara Chandrababu Naidu

చంద్రబాబు ఆస్తులపై వైసిపి, టిడిపి మాటలయుద్దం : 

గత సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ దేశంలోని అందరు ముఖ్యమంత్రుల ఆస్తిపాస్తుల వివరాలను బైటపెట్టింది. అప్పటినుండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేశంలోని రిచ్చెస్ట్ సీఎంల లిస్ట్ లో ఆయనపేరే టాప్ లో వుంది.  

అయితే వైసిపి నాయకులు మాత్రం తమ నాయకుడు వైఎస్ జగన్ ను అవినీతిపరుడు, ప్రజలసొమ్మును దోచుకున్నాడు అంటారుగా... మరి మీరెలా ఇంత ఆస్తి సంపాదించారో చెప్పాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు.   అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఫ్యామిలీ భారీగా ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపిస్తున్నారు. ఖర్జూర నాయుడు కేవలం రెండెకరాల సామాన్య రైతు... అలాంటిది ఆయన కొడుకు చంద్రబాబు ఇన్నివేల కోట్లు ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నిస్తున్నారు.

ఇలా వైసిపి నాయకుల విమర్శలకు టిడిపి కూడా గట్టిగానే జవాభిస్తోంది. చంద్రబాబు కుటుంబం వ్యాపారాల ద్వారా ఈ ఆస్తులు సంపాదించింది... వైఎస్ జగన్ లా ప్రజల సొమ్మును దొచుకుని ఆస్తులు పెంచుకోలేదని అంటున్నారు. చంద్రబాబు రాజకీయాల ద్వారా తన కుటుంబానికి ఎలాంటి లబ్ది చేయడంలేదని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇలా చంద్రబాబు ఆస్తుల గురించి ఏడిఆర్ ప్రకటన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. 

34
Nara Chandrababu Naidu

రెండెకరాల రైతు బిడ్డ సీఎం ఎలా అయ్యారు?  

వైసిపి ఆరోపణలు నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ జీవితం గురించే కాదు వ్యక్తిగత జీవితం, ఆస్తిపాస్తుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దేశ ప్రజలు. కాబట్టి చంద్రబాబు అట్టడుగు స్థాయినుండి అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగారో తెలుసుకుందాం. 

ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో పుట్టిపెరిగారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) లోని నారావారిపల్లె అతడి స్వగ్రామం. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు సామాన్య రైతు. తల్లి అమనమ్మ గృహిణి. చంద్రబాబుకు ఓ సోదరుడు(రామ్మూర్ది నాయుడు ఇటీవలే మరణించాడు), ఇద్దరు చెల్లెల్లు .  

ఖర్జూర నాయుడిది వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఆదాయం తక్కువగా వున్నా పిల్లల చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఈ దంపతులు. అందువల్లే చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదిగారు. 

నారావారిపల్లెలో పాఠశాల లేకపోవడంతో ఐదవ తరగతి వరకు పక్కనే వున్న శేషాపురం వరకు నడుచుకుంటూ వెళ్లి చదివారు చంద్రబాబు.  ఆ తర్వాత చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు... ఆ తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఇక్కడే మాస్టర్స్ డిగ్రీ చేసే సమయంలోని రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు... అక్కడ విద్యార్థి నాయకుడిగా మొదలైన చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. 

1978 లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు చంద్రబాబు. ఇలా కేవలం 28 ఏళ్ల వయసులోని ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత టి. అంజయ్య ప్రభుత్వంలో కేవలం 30 ఏళ్లకే మంత్రి అయ్యారు. సినిమాటోగ్రఫి మంత్రిగా పనిచేసే కాలంలోనే టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు దృష్టిలో పడ్డారు. ఇది చంద్రబాబు లైఫ్ మరో టర్న్.

1981 లో ఎన్టిఆర్ కూతురు భువనేశ్వరిని పెళ్ళాడి ఆయనకు అల్లుడయ్యారు. మామ స్థాపించిన టిడిపిలో చేరి ఉమ్మడి రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి మరో రెండుసార్లు సీఎం అయ్యారు చంద్రబాబు. 

44
Nara Chandrababu Naidu

సీఎం కాస్త రిచెస్ట్ సీఎం ఎలా అయ్యారు? 

రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారు చంద్రబాబు. అయితే ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందే 1992 లో హెరిటేజ్ ఫుడ్స్ బిజినెస్ ప్రారంభించారు. ఇటు చంద్రబాబు రాజకీయాలు చూసుకుంటే... అటు ఆయన భార్య హెరిటేజ్ బాధ్యతలు చూసుకున్నారు. ఇలా చంద్రబాబుతో పాటే హెరిటేజ్ సంస్థ కూడా ఎదిగింది. 

ఈ సంస్థలో చంద్రబాబు కుటుంబసభ్యులకు  35.7 శాతం వాటా వుంది. ఇందులొ భువనేశ్వరికి 24 శాతం,లోకేష్ కు 10 శాతం వాటా వుండగా నారా బ్రాహ్మణి 0.46 శాతం,దేవాన్ష్ 0.06 శాతం షేర్లు కలిగివున్నారు. హెరిటేజ్ లో భువనేశ్వరికి అత్యధికంగా 2,26,11,525 షేర్లు వుంటే లోకేష్ కు 1,00,37,453 షేర్లు వున్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో హెరిటేజ్ షేర్ల విలువే అత్యధికం. 

ఎన్నికల అఫిడవిట్ లో కూడా భార్య భువనేశ్వరి పేరిట వున్న హెరిటేజ్ షేర్ల విలువను చూపించారు చంద్రబాబు. అలాగే మిగతా ఆస్తులను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఇప్పుడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా గుర్తింపు పొందారు. 

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత హెరిటేజ్ షేర్ల ధర మరింత పెరిగింది. మరోసారి చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఆదారపడే పరిస్థితి రావడం హెరిటేజ్ సంస్థకు కలిసివచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే హెరిటేజ్ షేర్లు ఆల్ టైమ్ రికార్డ్ ధరకు చేరుకున్నాయి. కేవలం నాలుగైదర రోజుల్లోనే షేర్ విలువు 55 శాతం పెరిగింది. దీంతో చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ అమాంతం పెరిగాయి. 

ఎన్నికల ఫలితాలకు ముందు హెరిటేజ్ షేర్ విలువ రూ.424 వుంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా రూ.661 కి చేరుకున్నాయి. దీంతో కేవలం రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సంపద రూ.535 కోట్లు, కొడుకు లోకేష్ రూ.237 కోట్లకు పెరిగింది. ఈ హెరిటేజ్ షేర్ల పెరుగుదలను చూస్తే చంద్రబాబు కుటుంబ ఆస్తి మరింత ఎక్కువగా వుంటుంది. 


 

Read more Photos on
click me!

Recommended Stories