టీడీపీలో జోష్:టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్

First Published Jan 19, 2021, 2:30 PM IST

కర్నూల్ జిల్లా రాజకీీయాల్లో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మరోసారి క్రియాశీలకం కానున్నారు. గతంలో ప్రాతినిథ్యం వహించిన డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ ప్రభాకర్ ఇంచార్జీ బాధ్యతలు స్వీకరించారు. 

కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కేఈ కుటుంబానికి కీలక పాత్ర. గతంలో టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మరోసారి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దమయ్యారు. టీడీపీ డోన్ అసెంబ్లీ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు.
undefined
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు. ఆయన తనయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓడిపోయాడు.
undefined
ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల్లో కేఈ ప్రతాప్ తో పాటు కేఈ కృష్ణమూర్తి తనయుడిపై కూడ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కొన్ని కారణాలతో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు.
undefined
ఆ తర్వాత శాసనమండలిలో ఓటింగ్ సమయంలో చంద్రబాబునాయుడు కేఈ ప్రభాకర్ కు ఫోన్ చేశారు. పార్టీ జారీ చేసిన విప్‌నకు అనుకూలంగా ఓటు చేయాలని కోరారు. ఈ విషయమై కూడ కేఈ ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.
undefined
కేఈ కుటుంబంలో సోదరులు జిల్లా రాజకీయాలపై ఇటీవల సమావేశమై చర్చించారు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుండి కేఈ ప్రతాప్ తప్పుకొన్నారు
undefined
ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాడు. ఈ స్థానంలో కేఈ ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు కూడ సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.
undefined
గతంలో డోన్ అసెంబ్లీ స్థానం నుండి కేఈ ప్రభాకర్ ప్రాతినిథ్యం వహించాడు. 1996లో కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ నుండి విజయం సాధించారు. డోన్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
undefined
1999 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి మరోసారి ఆయన విజయం సాధించారు. 1996, 1999 లలో చంద్రబాబు కేబినెట్ లో కేఈ ప్రభాకర్ మంత్రిగా పనిచేశాడు. 2004 లో డోన్ నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత ఆయన డోన్ కు దూరంగా ఉంటున్నారు.
undefined
డోన్ , పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఎక్కడినుండైనా పోటీకి తాను సిద్దమేనని కేఈ ప్రభాకర్ తేల్చి చెప్పారు. గతంలో తాను టీడీపీకి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. కానీ, తన రాజీనామాను టీడీపీ ఆమోదించలేదని ఆయన కేఈ ప్రభాకర్ గుర్తు చేశారు.
undefined
గత ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరింది.ఈ సమయంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరిక విషయమై చంద్రబాబునాయుడు కేఈ కృష్ణమూర్తితో చర్చించారు.
undefined
టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది
undefined
click me!