మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. కుటుంబంతో ఆనందోత్సాహాలు..

First Published | Apr 11, 2022, 2:19 PM IST

నగరి ఎమ్మెల్యే రోజా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కుటుంబంతో సంతోషంగా గడిపారు. కొడుకు, కూతురు, భర్తతో కలిసి స్వీట్లు తినిపించుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

roja

ఏపీలోని న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి అయ్యారు. సోమ‌వారం ఆమె మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న రోజా నేడు మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 1999లో నుంచి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ఆమెకు దాదాపు 22 సంవత్స‌రాల తరువాత మంత్రి అయ్యే ఛాన్స్ వ‌చ్చింది. దీంతో ఆమె చేసిన పూజ‌లు ఫ‌లించిన‌ట్లైంది. 

roja family 2

ఫైర్ బ్రాండ్ గా రోజా గురించి తెలుగునాట పరిచయం అక్కర్లేదు. నటిగా మొదలైన ఆమె ప్రస్థానం ఆ తరువాత 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటి టీడీపీలో పనిచేసిన ఆమె అనంతరం వైఎస్సార్ సీపీలో చేరారు. 


roja with selvamani

వైఎస్సార్సీపీ పార్టీ తరఫున నగరి అసెంబ్లీ నియోజవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తరువాత 2019లో కూడా అదే నియోజకవర్గంనుంచి విజయం సాధించారు. మొదటిసారి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడిని, రెండోసారి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్ ను చిత్తుగా ఓడించారు. 

Roja family

2014 ఎన్నిక‌ల కంటే ముందే వైసీపీలో చేరిన ఆమె మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండగా నిలిచారు. అసెంబ్లీలో వైసీపీ వాయిస్ ను వినిపించ‌డంలో కీల‌కంగా ప‌ని చేశారు. దీంతో ఆమె సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌న్నిహితురాలిగా మారారు. 

roja with ys jagan

చివరికి రోజా నిరీక్షణ ఫలించి హోంమంత్రి పదవి దక్కడంతో కుటుంబంతో సంతోషంగా ఆ ఆనందాన్ని పంచుకున్నారు. భర్త, పిల్లలతో స్వీట్లు తినిపిస్తూ సంతోషాతరేకాలు వ్యక్తం చేసింది. ప్రమాణస్వీకారోత్సవంతో వైఎస్ జగన్ తో సెల్ఫీ కూడా దిగింది. 

Latest Videos

click me!