ఇక, గత తొమ్మిదేళ్లుగా రోజా జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్‌లో కూడా రోజా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రివర్గంలో బెర్త్ దక్కడంతో ఆమె వాటికి గుడ్ బై చెప్పారు. టీవీ, సినిమా షూటింగ్‌లకే దూరంగా కానున్నట్టుగా రోజా ప్రకటించడంతో.. ఆమె మొత్తంగా బుల్లితెరకు దూరం కానున్నారు.