పెత్తనం కోసం పాకులాట: 151 మంది బలగంతో జగన్‌కు తలనొప్పులు

First Published Oct 10, 2019, 6:15 PM IST

తమకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని.. తాము చెప్పిన మాటే వినాలని ప్రతిదానికి అడ్డం పడుతున్నట్లుగా లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న నెల్లూరు.. నేడు అనంతపురం.. రేపు మరో ప్రాంతంలో నేతల మధ్య వైసీపీ పెద్దలు పంచాయతీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

ఓ పాలనాపరమైన చికాకులు వెంటాడుతుంటే ఇవి చాలవన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీపరమైన చిరాకులు ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితం పార్టీ సీనియర్ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల ఎపిసోడ్‌ను అతి కష్టం మీద సర్దుబాటు చేశారు సీఎం.
undefined
జిల్లాపై ఆధిపత్యం కోసం కోటంరెడ్డి, కాకాణి నేరుగా తలపడటం.. చివరికి అది శ్రీధర్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్లడంతో సింహపురి రాజకీయాలు వెడేక్కాయి. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇద్దరిని అమరావతి పిలిపించి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో బుజ్జగింపచేశారు.
undefined
అలాగే కోటంరెడ్డిని కొన్నాళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా ఉండమని సూచించింది హైకమాండ్. నిన్నటి భేటీ తర్వాత తామిద్దరం బంధువులమని, అంతకుమించి బాల్య స్నేహితులమని కోటంరెడ్డి, కాకాణి వేరు వేరుగా మీడియా ముందు వెల్లడించారు. ఎట్టకేలకు వీరి పంచాయతీ సద్దుమణుగడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
undefined
అంతలోనే అనంతపురంలోనూ పార్టీ నేతల విభేదాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని సీఎం గురువారం అనంతపురంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే నేతల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
undefined
ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా తన పేరు లేదని.. కనీసం ఆహ్వాన పత్రిలో సైతం తన పేరు చేర్చలేదంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జిల్లా మంత్రి శంకర్ నారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమయంలో ఇద్దరికి మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్ధితిని చక్కదిద్దారు.
undefined
నెల్లూరు జిల్లాలాగే.. అనంతపురంలో సైతం జిల్లాను రూల్ చేయాలనుకునేవారి సంఖ్య భారీగా ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని హిందూపురం, ఉరవకొండ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలే గెలిచారు. ఇదే సమయంలో ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, మరో నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ప్రోటోకాల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవాలని ప్రతి ఒక్కరు ఆరాటపడుతున్నారు.. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
undefined
ప్రభుత్వంలో తమదే పైచేయి అవ్వాలని.. తాము చెప్పిందే అధికారులు, కిందిస్థాయి నేతలు వినాలని కొందరు భావిస్తున్నారు. కొందరు మంత్రులకు సైతం పార్టీలో సీనియర్ నేతల నుంచి ఇదే రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని.. తాము చెప్పిన మాటే వినాలని ప్రతిదానికి అడ్డం పడుతున్నట్లుగా లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న నెల్లూరు.. నేడు అనంతపురం.. రేపు మరో ప్రాంతంలో నేతల మధ్య వైసీపీ పెద్దలు పంచాయతీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
undefined
click me!